Anupama Parameswaran: రౌడీ బాయ్స్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకున్న అనుపమ..! ఎంత ఇచ్చారో తెలుసా..?
Anupama Parameswaran: కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన క్యూట్ లుక్స్ తో కుర్రకారు మతి పోగొడుతోంది. తాజాగా రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మళయాళం ‘ప్రేమమ్’ సినిమాతో తన సినీ కెరియర్ ప్రారంభించిన ఈ మల్లూ బ్యూటీ అనతి కాలంలో తెలుగు తెరపై మెరిసింది.
నాగచైతన్య పక్కన తెలుగులో వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయింది. తన అందంతో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఆ తరువాత శర్వానంద్ పక్కన ‘శతమానం భవతి’ సినిమాలో చేసింది. ఈసినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
దీంతో యంగ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారింది అనుపమ. ఆతరువాత రామ్ తో ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలోగురు ప్రేమ కోసమే’ సినిమాలతో బిజీ అయింది. ఇదిలా ఉంటే సైలెంట్ గా ఉండే అనుపమ కెరీర్లో లవ్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. క్రికెట్ స్టార్ జస్పీత్ బుమ్రాతో ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో రూమర్లు కూడా వచ్చాయి.
ఇదిలా ఉంటే మళ్లీ సినిమాలో బిజీ అవుతోంది ఈ అమ్మడు. తాజాగా రౌడీ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో.. ఆశిష్ పక్కన రౌడీ బాయ్స్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. కాగా.. ఈ అమ్మడు తన కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ రౌడీ బాయ్స్ సినిమాకే తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ ముట్టచెప్పారట నిర్మాతలు. అంతకు ముందు ఒక్కోసినిమాకు అనుపమ కేవలం రూ. 25 లక్షల వరకే ఇచ్చేవారు. అయితే గతంలో కాస్త పద్దతిగా కనిపించే అనుపమ.. ఈ సినిమాలో మాత్రం అందాలు ఆరబోసింది. లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. వీటి కారణంగానే రెమ్యునరేషన్ పెంచిందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…