Varun Tej: ఈ ఫోటోలో ఉన్న మెగా అందగాడు ఎవరో గుర్తుపట్టారా…ఈ హీరో గురించి ఆసక్తికరమైన విషయాలివే!
Varun Tej: మెగా కంపౌండ్ నుంచి వచ్చిన నటుల్లో వరుణ్ తేజ్ రూటే సపరేటు. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు యాక్టింగ్ ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు కూడా చేశారు. ఆరడుగుల ఎత్తుతో.. అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. తాజాగా ఈరోజు వరుణ్ తేజ్ బర్త్ డే జరుపుకుంటున్నారు. మెగా ప్రిన్స్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న వరణ్ తేజ్ పదేళ్ల వయసులోనే బాల నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు.
‘హ్యండ్సప్’ సినిమాలో నటించిన వరుణ్ తేజ్.. ఆ తరువాత ‘కంచె’, ‘ఫిదా’ సినిమాలో ఆడియన్స్ ను ఫిదా చేశారు. నటుడు, నిర్మాత నాగేంద్రబాబు, పద్మజల కుమారుడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఎక్కువగా కమర్షియల్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తారనే టాక్ ఉంది. కానీ వరుణ్ తేజ్ కంచె, అంతరిక్షం వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించాడు. నటుడిగా తనేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు.
మరోవైపు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో ఆడియన్స్ కు దగ్గరవుతున్నాడు. ముకుందా,కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 , గద్దల కొండ గణేష్ సినిమాలో తెలుగు తెరపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా కంచె సినిమాలో వరుణ్ తేజ్ యాక్టింగ్ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాయి.
ప్రస్తుతం ఎఫ్ 3, గనీ సినిమాలో బిజీగా ఉన్నాడు వరణ్ తేజ్. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ లు హీరోలుగా ఉన్నారు.ఇక వరుణ్ తేజ్ సోదరి నిహారిక నిర్మాతగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక నేడు వరుణ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ హీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…