Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. పేరు తెలియని వారుండరు. మొన్నటి వరకు కట్టు, బొట్టుతో పాటు.. తెలుగు అమ్మాయిలాగా చక్కగా చీర కట్టుకొని.. చూడటానికి ముద్దుగా కనిపించింది. ఏ మాత్రం స్కిన్ షోకి అవకాశం లేకుండా చూసుకుంటూ వచ్చింది.
తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథలనే ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది కానీ.. ఒక్కసారిగా ఆమె తన లైఫ్ స్టైల్ ని మార్చేసింది. తాజాగా ‘రౌడీబాయ్స్’ అనే సినిమాలో నటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల అయింది.
దీంతో ఒక్కసారిగా నెటిజన్లతో పాటు.. అనుపమ ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. ఎందుకంటే.. ట్రైలర్ లోనే లిప్ లాక్ సీన్ లో కనిపించింది. ఈ విషయంలో చాలా మంది అనుపమను ట్రోల్ చేశారు. డబ్బు కోసం ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తావా..? అంటూ ఆమెను టార్గెట్ చేశారు. రెమ్యూనరేషన్ కోసం ఇంత ఘోరంగా చేస్తావా.. అంటూ రెచ్చిపోయారు.
తాజాగా ఈ ట్రోలింగ్స్ పై అనుపమ స్పందించింది. హీరో ఆశిష్ తో కలిసి లిప్ లాక్ సీన్స్ పై వచ్చిన మీమ్స్ ను చూసి అనుపమ నవ్వుకుంది. దీనికి అభిమానులు ఫీల్ అయితే.. ఇక ఎప్పుడూ ఆశిష్ ను టచ్ కూడా చేయను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు.. ఓ ఫిలాసఫీ కూడా చెప్పుకొచ్చింది. సినిమాలో లిప్ లాక్ సీన్లో నటించింది తాను కాదు అని.. కేవలం తన పాత్ర మాత్రమే అంటూ చెప్పింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఆ సీన్ చూసి నెటిజన్లు కచ్చితంగా మనసు మార్చుకుంటారు అంటూ చెప్పింది. ఇలా అనుపమ రియాక్ట్ అయిన తీరు చూసి. నెటిజన్లు ఇంకా రెచ్చిపోయారు. ఇంత వెటకారంగా సమాధానం ఇస్తావా..? రౌడీ బాయ్స్ సినిమాలో నటించింది నువ్వు కాదా.. పాత్ర చేసింది మీరే కదా.. అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…