PM-CMs: మోదీతో సీఎంల సమావేశం..! థర్డ్ వేవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?
PM-CMs: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కల్లోలం కలిగిస్తోంది. అమెరికా, యూకే దేశాల్లో లక్షల్లో కేసులు వస్తున్నాయి. మరో వైపు ఇండియాలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. గత కొన్ని రోజుల క్రితం దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 10 వేలకు తక్కువగానే ఉండేది.
కానీ ప్రస్తుతం కేసులు సంఖ్య వేల సంఖ్య నుంచి లక్షలకు చేరాయి. తాజాగా ఈరోజు 2.45 లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు ఓమిక్రాన్ కేసులు కూడా పక్కలో బల్లెంలాగా పెరుగుతున్నాయి.
కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలను కఠిన తరం చేశాయి. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వారాంతపు లాక్ డౌన్లు అమలు చేస్తున్నారు.
చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే 15-18 ఏళ్ల లోపు ఉన్న టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ప్రికాషనరీ డోసులను కూడా వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నేడు భేటీ కానున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నారు. దీంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించే అవకాశం ఉంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరవచ్చు. మరోవైపు వ్యాక్సిన్ కార్యక్రమాలను వేగం చేయాలని సీఎంలకు సూచించే అవకాశం ఉంది. ప్రస్తుతం పండగలు వస్తున్న క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుసరించాల్సి విధానాల గురించి ప్రధాని.. సీఎంలకు దిశానిర్థేశం చేయనున్నారు. ఆక్సిజన్ సదుపాయాలు, బెడ్లను సిద్దం చేసుకోవాలని సూచించే అవకాశం ఉంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…