నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కు పలువురు సెలబ్రిటీలు అలాగే ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. ప్రభాస్ అభిమానులు తమ అభిమాన హీరో ఫోటోలకు అభిషేకాలు చేస్తూ కేక్స్ కట్ చేస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా నేడు ప్రభాస్ పుట్టినరోజు ఒక పండుగ అయితే, మరొక పండుగ ప్రభాస్ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేయడం మరొక పండుగ.
ఇలా రెండు పండుగలు ఒకేసారి రావడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అనుష్క ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రతి ఒక్క అంశంలో ప్రభాస్ బెస్ట్ గా ఉండాలని, తన స్టోరీస్ అన్నీ విజయవంతం అయి అందరి హృదయాలను గెలుచుకున్న వాలని కోరుకుంటున్నట్లు అనుష్క తెలిపింది.
ఇప్పటికే పలు సినిమాలలో ప్రభాస్ అనుష్క కలిసి నటించిన విషయం అందరికి తెలిసిందే. అలాగే ప్రభాస్ అనుష్కల మధ్య మంచి స్నేహ బంధం ఉందన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అనుష్క తిరిగి ప్రభాస్ తో మరొక సినిమాను చేయాలని అనుకుంటున్నారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.
ఆది పురుష్, రాధేశ్యామ్, సలార్, ప్రాజెక్ట్ కే, ఇలాంటి సినిమాలలో నటిస్తున్నాడు. సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఈ సినిమాలపై ప్రేక్షకులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడు ఎప్పుడూ షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్ లోకి కి వస్తాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…