అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ ఈ సంవత్సరంలో ఒక పాపకు జన్మనిచ్చి.. తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వామిక జనవరి 2021లో ముంబైలో జన్మించింది. ఈ జంట ఇటీవలే తమ నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా వాళ్లు తమ కూతురు వామికతో మీడియా కంట పడ్డారు.
మొదటి సారి విరాట్ కోహ్లీ తన కూతురును ప్రత్యక్షంగా బయట ప్రపంచానికి చూపించారు. అప్పడప్పుడు సోషల్ మీడియాలో వామిక ఫొటోలను షేర్ చేస్తున్నా.. ఇలా మాత్రం బయటకు తీసుకురాలేదు. ఇలా వారిద్దరితో కలిసి.. వామిక ఉండే ఫొటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
రాబోయే భారత క్రికెట్ సిరీస్ కోసం అనుష్క, విరాట్ , వామిక దక్షిణాఫ్రికాకు బయలుదేరినప్పుడు.. వాళ్ల కుటుంబం విమానాశ్రయంలో ఉండగా.. మీడియా ఎయిర్‌పోర్ట్‌లో క్రికెటర్ల ఫొటోలను క్లిక్ చేయడం మొదలుపెట్టింది. ఈ సమయంలో విరాట్ తన కూతురును ఎత్తుకొని వెళ్తుండగా.. దయచేసి బేబీని క్లిక్ చేయవద్దు.. ఫొటోలు తీయకండి.. అని విరాట్ వేడుకున్నాడు.
కానీ అప్పటికే చాలామంది విరాట్ కూతురు ఫొటోలను తీశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు విరాట్ దంపతులు తమ కూతురు ఫొటోను షేర్ చేసేవాళ్లు.. కానీ ఇలా మీడియా ద్వారా వామికా ఫొటోలు వైరల్ కావడం మొదటి సారి. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే.. తన క్లీన్ స్లేట్ ఫిలింజ్ బ్యానర్‌పై బాబిల్ ఖాన్ నటించిన ఖలా, సాక్షి తన్వర్ నటించిన మై చిత్రాల విడుదల కోసం ఎదురుచూస్తోంది. దీని తర్వాత సినిమా కోసం ఎలాంటి సంతకాలు చేయలేదు అనుష్క శర్మ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…