Pitapuram: పిఠాపురంలో రేపు ఏమైనా జరగొచ్చు.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో ఏముందో తెలుసా?

Pitapuram: ఎన్నికల ఫలితాలు మరీ కొన్ని గంటలలో రాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర రాజకీయమంత ఒకవైపు అయితే పిఠాపురం రాజకీయం మాత్రం మరో వైపు అనే నడుస్తోంది. కూటమిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగారు అయితే ఈయనకు పోటీగా వైసీపీ నుంచి వంగా గీత పోటీకి దిగారు.

ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఒకటవ తేదీన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలలో భాగంగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని వెల్లడించారు. దాదాపు లక్ష మెజారిటీ రాబోతుందని కొన్ని సర్వేలు చెప్పగా మరికొన్ని సర్వేలు 70 వేల వరకు పవన్ మెజారిటీ సొంతం చేసుకుంటారని వెల్లడించాయి.

ఇలా పవన్ కళ్యాణ్ గెలుస్తారని విషయం వెల్లడించడంతో పలు ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారనే విషయం తెలియడంతో పిఠాపురంలో ఏ క్షణం అయినా ఎలాంటి అల్లర్లు అయినా జరగవచ్చని ఇంటలిజెన్స్ పేర్కొంది.

అల్లర్లు జరగవచ్చు..
ఇప్పటికే పిఠాపురంలో రాయలసీమలో ఓ జిల్లాకు చెందినటువంటి కొంతమంది మోహరించారని వారందరిని తక్షణమే అక్కడి నుంచి పంపించాలని కోరింది అంతేకాకుండా కౌంటింగ్ వద్ద పెద్ద ఎత్తున భద్రతను కూడా పెంపొందించాలని సూచించారు. ఎప్పుడైనా ఏ క్షణమైనా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని వైసిపి నేతలు పిఠాపురంలో టిడిపి జనసేన కార్యకర్తలపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పేర్కొనడమే కాకుండా మరింత భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago