AP: జగన్ నిర్ణయంతో పిఠాపురం వర్మకు రాజయోగం… అలా కలిసొచ్చిందిగా?

AP: పిఠాపురంలో టీడీపీ ఇన్ చార్జీగా ఉన్నటువంటి వర్మ పవన్ కళ్యాణ్ విజయానికి ఎంతగానో కారణమయ్యారు. నిజానికి ఈ నియోజకవర్గంలో వర్మ పోటీ చేయాల్సి ఉండగా కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అప్పట్లో పెద్ద ఎత్తున గొడవ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు బుజ్జగింపు కారణంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ కు అఖండమైన విజయాన్ని అందించారు.

ఇక వర్మ కూడా త్వరలోనే రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాలు ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం జరిగింది. అయితే దీనిపై సీరియస్ అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి…ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేశారు. ఈ వేటుపై స్పీకర్ కూడా స్పందించి… ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది.

ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ పదవులకు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు. ప్రస్తుతం తెలుగుదేశం కూటమికి 164 ఎమ్మెల్యేలు ఉన్నారు.  రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం కూటమి సొంతం చేసుకోబోతుంది.

ఎమ్మెల్సీగా వర్మ..
ఈ లెక్క ప్రకారం ఈ ఎన్నికల్లో వైసీపీపార్టీ అసలు పోటీ చేయకపోవచ్చు. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఒకటి పిఠాపురం వర్మకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. వర్మకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఇలా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి తనను ఎమ్మెల్సీగా శాసనసభకు పంపించబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ వారిపై అనర్హత వేటు వేయడం వర్మకు ఇలా కలిసి వచ్చే అంశంగా మారిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago