YS Sharmila: వైయస్ షర్మిల ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈమెకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే రుషికొండ ప్యాలెస్ వివాదం గురించి కూడా తనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రుషి కొండ ప్యాలెస్ 500 కోట్లతో నిర్మించారు అయితే ఇదంతా కూడా ప్రభుత్వ ధనం కావటం గమనార్హం.
ఇకపోతే గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వారి అనుబంధ మీడియా సంస్థలు ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత లాభం కోసం కట్టుకున్నారని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాలను వైసీపీ నేతలు పూర్తిగా ఖండిస్తూ అది ప్రభుత్వ భవనాలు అని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం వాటిని ఏ విధంగా అయినా ఉపయోగించుకునే హక్కు వారికి ఉందని తప్పుడు వార్తలను ఖండిస్తున్నారు.
ఈ క్రమంలోనే వైయస్ షర్మిల సైతం రుషికొండ భవనాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రుషికొండ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించరాని నేరమన్నారు షర్మిల. రుషికొండ ప్యాలెస్‌ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు తెలియాలన్నారు.
క్షమించరాని నేరం..
ఇక ఒక అడుగు ముందుకేసి రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని ఈమె తెలియజేశారు ఒకవేళ ఇది తప్పని రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వైసీపీ దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిందని.. విచ్చలవిడిగా ఖర్చు చేసిందని షర్మిల ఆరోపణలు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…