AP: పిఠాపురంలో టీడీపీ ఇన్ చార్జీగా ఉన్నటువంటి వర్మ పవన్ కళ్యాణ్ విజయానికి ఎంతగానో కారణమయ్యారు. నిజానికి ఈ నియోజకవర్గంలో వర్మ పోటీ చేయాల్సి ఉండగా కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అప్పట్లో పెద్ద ఎత్తున గొడవ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు బుజ్జగింపు కారణంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ కు అఖండమైన విజయాన్ని అందించారు.

ఇక వర్మ కూడా త్వరలోనే రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాలు ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం జరిగింది. అయితే దీనిపై సీరియస్ అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి…ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేశారు. ఈ వేటుపై స్పీకర్ కూడా స్పందించి… ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది.
ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ పదవులకు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు. ప్రస్తుతం తెలుగుదేశం కూటమికి 164 ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం కూటమి సొంతం చేసుకోబోతుంది.
ఎమ్మెల్సీగా వర్మ..
ఈ లెక్క ప్రకారం ఈ ఎన్నికల్లో వైసీపీపార్టీ అసలు పోటీ చేయకపోవచ్చు. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఒకటి పిఠాపురం వర్మకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. వర్మకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఇలా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి తనను ఎమ్మెల్సీగా శాసనసభకు పంపించబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ వారిపై అనర్హత వేటు వేయడం వర్మకు ఇలా కలిసి వచ్చే అంశంగా మారిందని చెప్పాలి.





























