ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. 6500 ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభం..?

ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కొత్త ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి గత ప్రభుత్వానికి భిన్నంగా పరిపాలన సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ డిసెంబర్ నెలలో 6,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రకటన అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.

రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల నిర్ణయాల అమలు విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ నెలలో 6,500 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుందని సీఎం జగన్ తెలిపారు.

తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజాగా రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా, నగర పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో ఉన్న ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరిలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన రికూట్ మెంట్ షెఢ్యూల్ విడుదల కావచ్చని తెలుస్తోంది. నిరుద్యోగులు ఇప్పటినుంచే ప్రయత్నిస్తే సులువుగా ఉద్యోగం సాధించవచ్చు.

మరోవైపు ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడం వల్ల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీపీఎస్సీ ఈ నెల 29వ తేదీన కొత్త షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.