Featured

Ap Food commision chairman Prathap Reddy : యూట్యూబ్ లో చెప్పేవి నీతులు చేసేవి కబ్జాలు…. నీకు దమ్ముంటే ఆరోపణలు నిజమని చెప్పు ఊరొదిలి వెళ్ళిపోతా…: ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి

Ap Food commision chairman Prathap Reddy : ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా అవినీతిపరులకు సింహ స్వప్నంలా పనిచేస్తున్న విజయ్ ప్రతాప్ రెడ్డి గారు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి బాగా తెలుసు. పలు పాఠశాలలో తనిఖీలను నిర్వహిస్తూ నాణ్యత ప్రమాణాలను పాటించని వాటిమీద చర్యలను తీసుకుంటూ నిజాయితీకి మారుపేరు, ఒక ప్రభుత్వం ఉద్యోగి ఈయన లాగా పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేలా ఉండే విజయ ప్రతాప్ రెడ్డి గారి మీద టీడీపీ నేత లోకేష్ గారు పాదయాత్రలో అవినీతి ఆరోపణలను చేసారు. ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించడంతో ప్రతాప్ రెడ్డి అందుకు కౌంటర్ వేశారు.

నిరూపిస్తే ఊరు విడిచి పోతా…

ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ఉంటూ మంచి పేరు ఉన్న ప్రతాప్ రెడ్డి గారి మీద టీడీపీ నేత నారా లోకేష్ బద్వేల్ పాదయాత్రలో జూన్ 12 వ తేదీన నిర్వహించిన బహిరంగ సభలో అవినీతి ఆరోపణలను చేసారు. లోకేష్ గారు మాట్లాడుతూ రంగసముద్రం అనే ఊరి వద్ద చెరువు సమీపంలో ప్రతాప్ రెడ్డి ఆయన మనుషులు బినామీ పేరుతో భూ కబ్జాలకు పాల్పడ్డారని, యుట్యూబ్ లో నీతులు చెబుతూ బయట చేసేది అవినీతి పనులంటూ విమర్శించారు. రంగసముద్రం సర్వే నెంబర్ 1289లో 11 ఎకరాలు , సర్వే నెంబర్ 1094, 1076-1a లో బినామి పేరుతో కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే రంగసముద్రం చెరువు వద్ద కూడా సర్వే నెంబర్ 916 లో 24 ఎకరాలు, అలాగే రెవిన్యూ భూమి సర్వే నెంబర్ 1095 లో 21 ఎకరాలు, సర్వే నెంబర్ 1095/3 మూడు ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో కాజేసారని ఆరోపించారు.

ఇక ఈ ఆరోపణల మీద ప్రతాప్ రెడ్డి గారు స్పందిస్తూ లోకేష్ నిజాలను తెలుసుకోకుండా పేపర్ లో రాసుకొచ్చింది చదివేసాడు. పప్పు అని లోకేష్ ని ఎందుకంటారో ఇప్పుడు తెలుస్తోంది అంటూ మాట్లాడారు. తాను నిజాయితీగా పిల్లలు గర్భవతులు సంపూర్ణ నాణ్యత గల ఆహరం తినాలని కోరుకుంటూ అందుకోసం కష్టపడి పనిచేస్తున్నాను. నాలాంటి నిజాయితీ గల ఆఫీసర్ మీద బురద జల్లడం ఏమిటి అంటూ నిరూపిస్తే ఊరు వదిలి వెళ్ళిపోతానంటూ చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి తప్పు ఎవరు చేసినా పార్టీ ఏదైనా చర్యలు తీసుకోమని స్వేచ్చ ఇవ్వడం వల్లే ఏ అడ్డంకులు లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago