జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్న ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే ఓలా క్యాబ్స్ ఉపయోగిచుకోవడానికి అవకాశం కల్పించింది. ఇది కేవలం అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వారికి మాత్రమే అని స్పష్టం చేసింది. ఏపీలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఓలా ముందుకు వచ్చింది. డయాలసిస్, గుండెజబ్బులు, క్యాన్సర్ తదితర రోగులకు ఓలా సేవలు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు.
మొదటిదశలో విశాఖపట్నం లో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇక్కడ మంచి ఫలితాల్ని ఇస్తే మిగిలిన నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. అయితే కరోనా లక్షణాలు లేని వారికీ మాత్రమే ఈ సేవలు వినియోగించుకోవడానికి అనుమతిస్తారు. ఆసుపత్రి నుంచి ఇంటికి, ఇంటినుంచి ఆసుపత్రికి మాత్రమే ఈ సేవలను అందిస్తారు. ఒక క్యాబ్ డ్రైవర్ తో పాటుగా మరో ఇద్దరికీ మాత్రమే క్యాబులో చోటు ఉంటుంది. డాక్టర్ లు, మెడికల్ సిబ్బంది కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. కారులో కూర్చున్న వరకు ఖచ్చితంగా దూరం పాటించాల్సిందే. నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటారు. అయితే, కర్ణాటకలో ఇటువంటి సెలవలు ఇప్పటికే అమలులో ఉన్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…