AP Politics: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమిచ్చి, ఆ ఇంటికి అందాల్సిన ప్రభుత్వ పథకాలన్నింటిని వాలంటీర్ సహాయం ద్వారా అందజేశారు. ఇలా ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని చెప్పాలి.
ఇలా వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనంగా 5000 రూపాయలు చెల్లించారు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను అప్పట్లో ప్రతిపక్ష నేత ఆయన చంద్రబాబు నాయుడు పూర్తిగా తప్పు పట్టారు. వాలంటీర్ ఉద్యోగం అంటే గోన సంచలు మోసే ఉద్యోగం అని తెలిపారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారని కూడా వాలంటీర్ వ్యవస్థ పై మండిపడ్డారు.
ఇలా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీరా ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ల గురించి ఎక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు తాజాగా శాసనమండలిలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని తద్వారా 2023 సెప్టెంబర్ నుంచి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లించాలని ఈయన తెలిపారు. వైసీపీ వారు వాలంటీర్లతో రాజీనామా చేయించారు. వైసిపి తమని నమ్ముకున్న ప్రజలు అలాగే కార్యకర్తలను పూర్తిగా మోసం చేసింది అంటూ బాల వీరాంజనేయులు చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి ఈయన మాటలను బట్టి చూస్తుంటే ఇక ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేదని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…