Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల అయ్యప్ప మాల ధరించి కడప అమీన్ పీర్ దర్గాకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది హిందూ సంఘాలు అయ్యప్ప మాల ధరించి రామ్ చరణ్ దర్గాకు వెళ్లడాన్ని పూర్తిగా తప్పు పట్టారు.
దర్గా అంటే ఓ సమాధి ఇలా అయ్యప్ప మాల ధరించి సమాజ దగ్గరకు వెళ్లడం ఏంటి అంటూ ఈయన వ్యవహరి శైలిని పూర్తిస్థాయిలో విమర్శించారు. అయితే రామ్ చరణ్ దర్గాలో నిర్వహిస్తున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ విషయంలో రామ్ చరణ్ పట్ల వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆయన సతీమణి ఉపాసన ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ తన భర్తకు అండగా నిలిచారు.
ఈ సందర్భంగా ఉపాసనకు నెటిజన్ ఉపాసనని ట్యాగ్ చేస్తూ..మేడమ్ ఇతర మతాలను గౌరవించడం అంటే మీరు అయ్యప్ప మాలలోని వారి దర్గాకు వెళ్లడం కాదు. వారి విశ్వాసాన్ని అవమానించకుండా మరియు మన మతంలో జోక్యం చేసుకోకుండా వారు చేసే వాటిని గౌరవించడం ద్వారానే మతాన్ని గౌరవించుకోగలుగుతాం అంటూ ట్వీట్ చేసింది.
ఇక ఈ పోస్టుకు ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా దర్గాలో చరణ్ దర్శించుకుంటున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ..విశ్వాసం ఏకం చేస్తుంది, అది ఎప్పటికీ విడిపోదు. భారతీయులుగా మనం దైవానికి సంబంధించిన అన్ని మార్గాలను గౌరవిస్తాము.. మన బలం ఐక్యతలోనే ఉంది. ఎల్లప్పుడూ రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తాడు.. వన్ నేషన్ వన్ స్పిరిట్.. జైహింద్ అంటూ చరణ్ దర్గాలో ఉన్న ఫోటోని షేర్ చేయడమే కాకుండా దర్గాకు వెళ్తే తప్పు లేదని కూడా ఈమె తన భర్తకు మద్దతుగా నిలిచారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…