Political News

Revanth Reddy: కచ్చితంగా వారి చేత ఊచలు లెక్క పెట్టిస్తా.. రేవంత్ రెడ్డి వార్నింగ్ వారికేనా?

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం హనుమకొండలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన బిఆర్ఎస్ నాయకుల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరురాలిని చేయటమే మా ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

గత పది సంవత్సరాల బి ఆర్ ఎస్ హయామంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు కానీ కాంగ్రెస్ హయాంలో ఇద్దరు మహిళ మంత్రులకు చోటు దక్కిందని అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మహిళ అంటూ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇది మహిళల ప్రభుత్వమని రేవంత్ వెల్లడించారు.

వరంగల్లో హైదరాబాద్ కి పోటీ నగరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఇలా అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసిన వారి చేత ఊచలు లెక్క పెట్టిస్తానని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.అక్రమ సంపాదనతో కిరాయి మనుషలను తెచ్చి కుట్రలు చేస్తే జైలుకు పంపిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలిసిందంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సైతం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Revanth Reddy: కెసిఆర్ ఉద్యోగం..


తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోవడం వల్ల మీ ఇంట్లో నలుగురు పదవులు పోయాయి తప్ప సమాజంలో ఏం కాలేదని తెలిపారు. ఒక కేసీఆర్ ఉద్యోగం పోవడంతోనే రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంతోమంది రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని తెలిపారు. చిన్న చిన్న తప్పిదాలు ఉన్న వారికి కూడా త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago