AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే 5000 గౌరవ వేతనంతో వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా మారారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు అన్నింటిని స్వయంగా ప్రజల ఇంటి ముంగిటకు తీసుకువెళ్లారు.
ఇలా వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వీరికి 5 వేల రూపాయల గౌరవ వేతనం అందించారు. అయితే మొదట్లో ఈ వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్నికల సమయానికి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం అందించబోతున్నట్లు ఈయన వెల్లడించారు.
ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేక పోతున్నారని వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మమ్మల్ని మీరే ఆదుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ను కోరుతూ ఆందోళనలు చేపట్టారు.
ఎన్నికల హామీలలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ పదివేల రూపాయల వేతనం చెల్లించాలని తెలిపారు.. దయచేసి మాపై రాజకీయ రంగు పూయకండి మేము ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ అధికారుల ఆదేశాలను పాటిస్తామని మాపై మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణమే మమ్మల్ని విధులలోకి తీసుకోవాలని వాలంటీర్లు ఆందోళన చేశారు. అయితే గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఇకపై వాలంటీర్ వ్యవస్థ ఉండదనే ఉద్దేశంతోనే ప్రస్తుత అధికార నేతలు మంత్రులు వెల్లడిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…