Political News

Pawan Kalyan: దేశ రాజకీయాలలో సంచలనంగా మారిన పవన్.. మహారాష్ట్రలో తుఫాను సృష్టించిన పవన్!

Pawan Kalyan: పార్టీ పెట్టి పదేళ్లయిన ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు అంటూ పవన్ కళ్యాణ్ ని గతంలో ఎంతో మంది ఎన్నోసార్లు అవమానించారు అయితే ఆ అవమానాలను తన విజయ సోపానాలుగా మార్చుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపీ పార్టీని భారీ దెబ్బ కొట్టారు. ఇలా జగన్ పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్చేశారు.

ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగం కావడంతో ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా ఈయన పాల్గొన్నారు అయితే పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఏ ఏ ప్రాంతాలలో అయితే పర్యటించారో ఆ ప్రాంతాలలో మహాయుతి కూటమి నేతలకు భారీ మెజారిటీ రావడం విశేషం.

పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో భాజపా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకువెళుతోంది. ప్రధానమంత్రి మోదీ అన్నట్లు… పవన్ కల్యాణ్ తుఫాన్ ప్రభంజనం మహారాష్ట్రలో కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ మహారాష్ట్ర ఎన్నికలలో స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పేరు మరోసారి దేశ రాజకీయాలలో సంచలనగా మారుమోగుతుంది.

Pawan Kalyan: గేమ్ ఛేంజర్..

ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో అక్కడ కూటమికి భారీ మెజారిటీ లభించింది.2019 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు 105 విజయం సాధించగా ఇప్పుడు 2024లో ఆ సంఖ్య 122కి చేరుకుంటోంది. ఇది ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ప్రభావం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా పవన్ పర్యటించిన ప్రాంతాలలో కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలియజేసాయి. ఇక ఫలితాలు కూడా అదే దిశగా దూసుకుపోతున్న తరుణంలో పవన్ పేరు మరోసారి దేశ రాజకీయాలలో మారు మోగడమే కాకుండా పవన్ ఒక గేమ్ ఛేంజర్ అంటూ అభిమానులు పవన్ రాజకీయ ప్రస్థానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

https://x.com/Kapu_community1/status/1860181681489252383?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1860181681489252383%7Ctwgr%5E665056d965dcf31f05e0edc09d9dee55593f1604%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fwebduniyatelugu-epaper-dhf5944cd9e02d4af4be596697762dbf62%2Fpavantufaanefektmahaaraashtraloadhikaaramchejikkinchukuntunnamahayutikutami-newsid-n640421463

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago