Movie News

Sonia: ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకున్న బిగ్ బాస్ బ్యూటీ సోనియా.. ఫోటోలు వైరల్!

Sonia: జార్జ్ రెడ్డి మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన తెలుగు అమ్మాయి సోనియా ఆకుల. ఈమె రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్, దిశా ఎన్కౌంటర్ చిత్రాల్లో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న సోనియా ఆకుల అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు.

ఇలా బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె నాలుగు వారాలపాటు హౌస్ లో కొనసాగుతూ నాలుగవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా హౌస్ లో సోనియా ఉన్నది తక్కువ కాలమే అయినప్పటికీ కాస్త నెగెటివిటీని సొంతం చేసుకున్నారు. అయితే బయటకు వచ్చిన తర్వాత తన పట్ల జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.

ఇకపోతే ఈమె తాజాగా ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకొని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. నిజానికి ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళకముందే పెళ్లి కుదిరిందట తన అత్తమామలు భర్త అంగీకారంతోనే బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన సోనియా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన ప్రియుడుతో కలిసి నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరి నిచ్చితార్థం ఈనెల 21వ తేదీ జరిగింది అయితే కాస్త ఆలస్యంగా ఈమె నిశ్చితార్థపు ఫోటోలు బయటకు వచ్చాయి.

Sonia: రెండో పెళ్లి..

ఇక సోనియా నిశ్చితార్థపు ఫోటోలు వైరల్ గా మారడంతో ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలపై అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక సోనియా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు యష్ పాల్. ఆయనతో సోనియాకు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లికి సిద్ధమయ్యారు అయితే ఈయనకు ఇదివరకే పెళ్లి జరిగి తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా సోనియా మెడలో ఆయన రెండోసారి మూడు ముళ్ళు వేయబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago