Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఈయన పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీతా పై పోటీ చేశారు. ఈ ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏకంగా 70 వేల ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక ఈ ఎన్నికల ఫలితాలలో భాగంగా కూటమి ఏకంగా 164 సీట్లు కైవసం చేసుకుని సంచలనమైన విజయం అందుకుంది. గత ఎన్నికలలో 151 సీట్లు అందుకున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీని భూస్థాపితం చేశారు. ఇలా కూటమి భారీ విజయాన్ని అందుకోవడంతో పవన్ కళ్యాణ్ కూడా కీలక పదవులు అధిరోహించబోతున్నారని తెలుస్తోంది.
కూటమి విజయం అందుకోవడానికి జనసేన కీలక పాత్ర పోషించిందని చెప్పాలి.దీంతో పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజారిటీ సొంతం చేసుకోవడంతో ఈయనకు కీలక పదవులు అందబోతున్నాయని సీఎంగా చంద్రబాబు నాయుడు కొనసాగుతూ ఉండగా, డిప్యూటీ సీఎం హోదా పవన్ కళ్యాణ్ అందుకోబోతున్నారని తెలుస్తోంది.
ఢిల్లీకి పయనం..
ఇలా డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా హోమ్ మినిస్టర్ గా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయం అందుకున్న తర్వాత నేడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ప్రమాణస్వీకారం రోజున పవన్ కళ్యాణ్ అందుకోబోయే పదవుల గురించి కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…