Mudragada: ఏపీ ఎన్నికలలో సంచలనమైన ఫలితాలను వెలుబడ్డాయి. గత ఎన్నికలలో 151 సీట్లు అందుకున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందజేసింది అయితే ఇలా సంక్షేమ పథకాలు కులమత బేధాలు లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారు.
ఇలా ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి జగన్ మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ ధైర్యంగా సవాల్ విసిరారు. అయితే ఈ ఎన్నికలలో గెలుపు పై ఎంతో ధీమా వ్యక్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ప్రతి ఒక్క ఇంటికి మంచి జరిగినా జగన్ కి మాత్రం ఓటు రూపంలో రుణం తీర్చుకోలేకపోయారు.
ఇదిలా ఉండగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపీ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరును రెడ్డిగా మార్చుకుంటాను అంటూ సవాల్ విసిరారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏకంగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ముద్రగడ పద్మనాభరెడ్డి..
ఇలా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం కావడంతో పవన్ గెలుపు పై ముద్రగడ స్పందించారు. పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని చెప్పిన నేను ఓడిపోయానని అందుకే చెప్పిన విధంగానే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని, ఇప్పటికే గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేశానని ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం చేసినటువంటి కామెంట్స్ సంచలనగా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…