Featured

APFC Chairman Vijay Prathap Reddy : నేను చిరంజీవి గారి అభిమాని… ఆయన కష్టపడి పైకి వచ్చారు… ఎవర్ని బాధపెట్టరు… ఈ వయసులో కూడా ట్రెండ్ సెటిల్ చేస్తున్నారు…: విజయ్ ప్రతాప్ రెడ్డి

APFC Chairman Vijay Prathap Reddy : ‘పునాది రాళ్ళు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వాళ్లకు ఆదర్శంగా నిలబడే స్థాయికి ఎదిగిన చిరు గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలను చూస్తూ ఆయనను అభిమానించే ఎన్నో కోట్లమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. కెరీర్ లో ఇంత సక్సెస్ చూసినా ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఆయన ఎన్నడూ ఒకరిని గట్టిగా విమర్శించడం, తిట్టడం చేయలేదు, వేరొకరు ఆయన మీద బురదజల్లినా కూడా ఓర్పుగా వ్యవహారించారు కానీ ఎవరితోనూ పరుషంగా మాట్లాడలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా అవినీతిపరులకు సింహ స్వప్నంలా పనిచేస్తున్న విజయ్ ప్రతాప్ రెడ్డి గారు చిరంజీవి గారి అభిమానే. ఆ అభిమానం నేడు ఆయన వృత్తిలో నిజాయితీగా ఉండటానికి తోడ్పడింది అంటూ చిరంజీవి గారి గురించి చెప్పారు.

ఠాగూర్ సినిమా ఇన్స్పిరేషన్ తో…

ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా తన విధి నిర్వహణలో నిజాయితీగా పని చేస్తున్న విజయ్ ప్రతాప్ రెడ్డి గారు ఎంతోమంది అభిమానాన్ని చూరగోన్నారు. అలాంటి ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని అంటూ ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన నటించిన సినిమాలను చూస్తూ పెరిగిన ప్రతాప్ రెడ్డి గారు ఠాగూర్ సినిమా చూసి అలానే నిజాయితీగా ఉండాలని అనుకున్నారట. ఇక చిరంజీవి గారు ఇప్పటికీ అంతే ఎనర్జిటిక్ గా నటిస్తున్నారంటూ చెప్పిన ప్రతాప్ రెడ్డి గారు ఆయన ఒకరిని పరుషంగా ఏదీ మాట్లాడరని మంచి మనసు కలవడంటూ చెప్పారు.

ఇక చిరంజీవి గారికి మొహమాటం ఎక్కువగా ఉందని అందుకే ఆయన రాజకీయాలకు పనికిరారని భావించినట్లు తెలిపారు. అయన లాంటి మంచి మనుషులు రాజకీయాల్లో ఇమడలేరంటూ తెలిపారు. ఎంతో కస్టపడి పైకి వచ్చిన చిరంజీవి గారు ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శం అంటూ తెలిపారు. వాల్తేరు వీరయ్య సినిమా చూడటం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపిన ప్రతాప్ రెడ్డి గారు ఆయన ఈ వయసులో కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago