Archana Shastri : 2004 లో ‘తపన’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించింది అర్చన. అదే సంవత్సరం ‘నేను’ సినిమాలోని తన నటనతో అందరికీ చేరువ అయ్యింది. మొదట వేద పేరుతో సినిమాలకు పరిచయం అయినా తరువాత కొన్నిరోజులకు అర్చన పేరుతో కెరీర్ ను సాగించింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్1లో కంటెస్టెంట్ గా వచ్చి 5వ స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం వివాహం చేసుకున్న అర్చన చాలా కాలంగా సినిమాలకు దూరంగా వుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మాట్లాడారు.
ఇండస్ట్రీలో అలాంటివారు ఉన్నారు…
ఇండస్ట్రీకి ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఒక అమ్మాయి వచ్చిందంటే ఆ అమ్మాయి వీక్నెస్ ను అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు చాలా మందే ఉంటారంటూ అర్చన అభిప్రాయపడ్డారు. తన విషయంలో ప్రతిదీ తల్లిదండ్రులు వెంట ఉండటం వల్ల అలాంటి పరిస్తుతుల నుండి తప్పించుకున్నాను అయితే అదే సమయంలో మరో అమ్మాయి ఇలాంటి ఇష్యూలో ఇరుక్కుంది. కొంతమంది హీరోలు అలా అమ్మాయిలను ట్రాప్ చేయడానికే ఉన్నారు.
మనకు బాగా తెలిసిన సక్సెస్ లేని ఒక హీరో వల్ల నేను ఇబ్బందులనుపడ్డాను కానీ నా పేరెంట్స్ నాకు సపోర్ట్ ఉండటం వల్ల నేను బయటపడ్డాను, అదొక చేదు అనుభవం అంటూ చెప్పా అర్చన. ఇండస్ట్రీ అనే కాదు ఏ రంగంలోకి వెళ్లాలనుకున్నా అమ్మాయిలు ధైర్యంగా ఉన్నంతవరకు ఎవరూ ఏమీ చేయలేరు. ఎపుడైతే వీక్ అవుతారో అపుడే పక్కన ఉన్నవాళ్లు అడ్వాంటేజ్ తీసుకుంటారు అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…