Silk Smita: సిల్క్ స్మిత పరిచయం అవసరం లేని పేరు వెండితెరపై ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె అర్ధాంతరంగా అతి చిన్న వయసులోనే కన్నుమూయడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. కళ్ళతోనే కుర్రకారులకు మతి పోగొట్టే సిల్క్ స్మిత ఒక సినిమాలో కేవలం పాటలో నటిస్తున్నారు అంటే ఆమెను చూడటం కోసమే ఎంతో మంది సినిమాకు వెళ్లేవారు. అంతలా సిల్క్ స్మిత క్రేజ్ సొంతం చేసుకున్నారు.
సినిమాలు విడుదలకు నోచుకోక ఆగిపోయినటువంటి ఎంతో మంది నిర్మాతలు తమ సినిమాలలో ఒక్క పాటలో నటించమని సిల్క్ స్మిత చుట్టూ తిరిగిన వారు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ఈమె నటించిన ఒక్క పాటతోనే భారీ లాభాలను అందుకున్న నిర్మాతలు కూడా ఉన్నారు.ఇలా నిర్మాతలకు ఎంతో మంచి లాభాలను అందించిన సిల్క్ స్మిత మరణం తర్వాత చిత్ర పరిశ్రమ ఆమె గురించి పెద్దగా పట్టించుకోలేదు.
సిల్క్ స్మిత మరణించిన చాలా సంవత్సరాలకు తాను మరణించే ముందు మాకు ఫోన్లు చేశారని పలువురు పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయితే ఈమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. సిల్క్ స్మిత మరణించడానికి సరైన కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు.కొందరు హత్య అంటే మరికొందరు ప్రేమ విఫలం, ఆర్థిక ఇబ్బందులు అంటూ ఎవరికి తోచినట్టు వారు ఈమె మరణానికి కారణాలు తెలుపుతున్నారు.
ఇక సిల్క్ స్మిత మరణించడంతో చాలామంది తనని ఆఖరి చూపు చూడటానికి కూడా రాలేదు అయితే ఒక స్టార్ హీరో మాత్రమే సిల్క్ స్మిత ఆఖరి చూపుకు వచ్చారని తెలుస్తోంది. ఇలా సిల్క్ స్మిత ఆఖరి చూపుకు వచ్చిన ఆ హీరో మరెవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్. ఇలా ఈయన సిల్క్ స్మితను చూడటానికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఇదే ప్రశ్న ఆయనని అడగడంతో అర్జున్ సిల్క్ స్మిత నటించిన ఓ సినిమా షూటింగ్ ఆఖరి రోజున ఈమె తనతో మాట్లాడుతూ నేను చనిపోతే నన్ను చూడటానికి వస్తావా అని ప్రశ్నించారట… ఆ మాట స్మిత అన్నప్పుడు అర్జున్ వెంటనే ఛీ అదేం మాట అంటూ ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారట. అయితే ఆమె మరణించిన తర్వాత ఈ విషయాన్ని గుర్తు చేసుకొని చిన్నపిల్లడిలా ఏడ్చారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…