Archana Shastri : 2004 లో తపన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించింది అర్చన. అదే సంవత్సరం నేను సినిమాలో తన నటనతో అందరికి చేరువ అయ్యింది. మొదట వేద పేరుతో సినిమాలకు పరిచయం అయిన తరువాత కొన్నిరోజులకు అర్చన పేరుతో కెరీర్ ను సాగించింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్1లో కంటెస్టెంట్ గా వచ్చి 5వ స్థానం లో నిలిచింది. అయితే ప్రస్తుతం వివాహం చేసుకున్న అర్చన చాలా కాలంగా సినిమాలకు దూరంగా వుంది. ఇటీవల ప్రసారం అయిన పాపులర్ షో అలీ తో సరదాగా కార్యక్రమానికి తన భర్త తో పాటు వచ్చి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
అవగాహన లేకుండా అవకాశన్ని వదులుకున్నా…
నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, పాండురంగడు వంటి సినిమాలలో మంచి పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది అర్చన. అయితే హీరోయిన్ గా మాత్రం సక్సెస్ పొందలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. చాలా రోజులుగా అభిమానులకు దూరంగా వున్న అర్చన అలీ తో సరదాగా ప్రోగ్రాంతో ప్రేక్షకుల ముందుకు తన భర్తతో కలసి వచ్చింది. తన భర్త జగదీశ్ తో పరిచయం,ప్రేమ, పెళ్లి విషయాల గురించి అభిమాలతో పంచుకుంది. తన కెరీర్ కి సంబందించిన అంశాలు కూడా చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే మగధీర సినిమాలలో అవకాశం వదులుకున్న దాని గురించి అలీ ప్రశ్నించగా…అవును యామదొంగ సినిమాలో ఒక పాట చేసిన తరువాత, రాజమౌళి మగధీర సినిమాలోని సలోని పాత్రకు అడిగారు. అపుడు నాకు సరైన అవగాహన లేకుండా అవకాశన్ని మిస్ చేసుకున్న. తరువాత మర్యాద రామన్న సినిమాల్లో హీరోయిన్ అయ్యుండేదాన్నేమో అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంకి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…