మనలో చాలా మంది శరీర బరువు తగ్గడానికి ఎంతో కష్టపడి శరీర వ్యాయామాలు చేస్తుంటారు. కొందరు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కష్టపడటం కాకుండా కొంత మంది బరువు పెరగడానికి కూడా ఎంతో కష్టపడుతుంటారు.బరువు పెరగడం చాలా సులువైన మార్గం అయినప్పటికీ కొంతమందిలో ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. రోజురోజుకి వయసు పెరుగుతున్న వయసుకు తగ్గ బరువు లేకపోవడంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. సాధారణంగా మనం తీసుకునే ఆహారం కన్నా ఎక్కువగా శ్రమపడే వారు. తక్కువగా ఆహారాన్ని తీసుకున్న వారు చాలా సన్నగా ఉంటారు. అయితే ఈ విధంగా సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి కొన్ని సులువైన మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.
బరువు పెరగాలని ప్రయత్నించేవారు ముందుగా వారు బరువు పెరగకపోవడానికి గల కారణాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఎలాంటి సమస్యలు లేనప్పుడు ముందుగా వారు తీసుకొనే ఆహారంపై దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యం. ఏ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ముందుగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. బరువు పెరగాలనుకొనే వారు ఎక్కువగా కొవ్వు శాతం ఉండే చీజ్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
మాంసాహారం తినే వారైతే వారీ డైట్ లో కచ్చితంగా సాల్మన్ చేపలను చేర్చుకోవడం ద్వారా బరువు పెరుగుతారు.బరువు తక్కువగా ఉండే వారు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. అమ్మాయిలు ఎక్కువగా అయోడిన్, క్యాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ శాతం పోషక విలువలు కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోకూడదు.కొద్ది కొద్ది పరిమాణంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకోవడం ద్వారా తొందరగా శరీర బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…