Are we afraid of 'Rappa Rappa'? Pawan Kalyan's sensational words on ysrcp
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. “మాట్లాడితే రప్పా రప్పా అంటున్నారు. వాళ్ల తాకాటుకు తాము భయపడేది లేదని, బెదిరింపులకు తలొగ్గేది కాదని స్పష్టం చేశారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరు కుంటామా?” అంటూ సూటిగా ఎదురు ప్రశ్నించారు. తాము ఎంతో కృషి చేసి, ఉద్యమాల ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పొందామని గుర్తు చేశారు. అలాంటి వారిని బెదిరిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. గత పాలకులు ఎలా ప్రజల తిరస్కారానికి గురయ్యారో ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు.
మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, వైసీపీ పాలనలో మద్యం పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “2019 ఎన్నికల ముందు మద్యం నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా విస్మరించి, ధరలు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేశారు” అని విమర్శించారు. నాసిరకం మద్యం వల్ల పలువురు మృతి చెందారని ఆరోపించారు. “డబ్బు పోతే ఓకే.. కానీ ప్రజల ప్రాణాలు తీసే విధంగా వ్యవహరించారా?” అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
లిక్కర్ స్కామ్‌లో పలువురు అరెస్టై ఉండటం గురించి కూడా పవన్ స్పందించారు. తప్పు చేశారనే గానీ వారిని అరెస్ట్ చేశారని, ఇది ఒక్కటే వైసీపీ పాలన అసలైన దారుణాన్ని బయటపెడుతోందని అన్నారు. పైగా తప్పు చేసి ప్రజలను ఎదిరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “ఈ పేపర్ పులులు, తాటాకు చప్పుళ్లకు కూటమి భయపడదు. తాము న్యాయ బద్ధంగా కేసుల విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని” పవన్ స్పష్టం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…