Cyberabad: న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు యువత సిద్ధం అవుతోంది. హైదరాబాద్ తో మొదలు పెడితే.. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో కూడా నయా సాల్ జోష్ కనిపిస్తోంది. మరో వైపు ఆంక్షలు విధించినప్పటికీ.. యువత తమదైన రీతిలో న్యూ ఇయర్ ను సెలబ్రెట్ చేసుకునేందుకు సిద్ధం అవుతోంది.
ఇదిలా ఉంటే మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 31 రోజున అర్థరాత్రి వరకు బార్లు, వైన్స్ తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇచ్చింది. ఇదిలా ఉంటే పోలీసులు కూడా భద్రతా పరమైన చర్యలకు సిద్ధం అవుతున్నారు. న్యూ ఇయర్ రోజు పబ్బులకు కీలక ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు.
మద్యం మత్తులో ఉన్నవారిని ఇంటికి చేర్చాల్సిన బాధ్యత పబ్ నిర్వహకులదే అని స్పష్టం చేశారు సైబారాబాద్ డీసీపీ విజయ్ కుమార్. బార్లు, పబ్బుల యజమాన్యాలు డ్రైవర్లు, క్యాబ్ లను ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ సూచించారు. డిసెంబర్ 30న సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ… పలు నిబంధనలను విధించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచి జనవరి 1 తేదీ వరకు రెండు వేల మంది పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. పబ్ లు, బార్లలో “Designated Driver for a day”ని అందుబాటులో ఉంచాలని, లేనిపక్షంలో 185 మోటర్ వేహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేయబడుతుందని హెచ్చరించారు. పరిమితికి మించి మద్యం తాగి రోడ్లపై వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడితే రూ. 10వేల జరిమానాలో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. రెండో సారి పట్టుబడితే రూ. 15 వేల జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష, మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. మైనర్లు వాహనం నడపకూడదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై సెక్షన్ 183, 184 కింద కేసులు నమోదు చేస్తామన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…