Health News

రాత్రి నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఇది స్ట్రెస్ సంకేతం కావచ్చు!

ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి చాలా మందికి రోజువారీ సమస్యగా మారింది. సాధారణంగా స్ట్రెస్ వల్ల మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు వస్తాయని తెలిసిందే. అయితే తాజా అంతర్జాతీయ అధ్యయనం మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఒత్తిడి దంతాల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా రాత్రిపూట నిద్రలో పళ్లు బిగించి కొరకడం లేదా దవడను గట్టిగా పట్టుకోవడం వంటి అలవాట్లు స్ట్రెస్‌తో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. ఉదయం లేవగానే పంటినొప్పి, దవడ నొప్పి లేదా తలనొప్పి అనిపిస్తే, అది రాత్రి నిద్రలో తెలియకుండానే పళ్లు కొరికిన సంకేతం కావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితిని వైద్య భాషలో “బ్రక్సిజం”గా పిలుస్తారు.

అధ్యయనాల ప్రకారం, జనాభాలో గణనీయమైన శాతం మంది రాత్రివేళల్లో ఒత్తిడి, ఆందోళన కారణంగా పళ్లు బిగించి కొరికే అలవాటు కలిగి ఉన్నారు. ఇది దీర్ఘకాలంలో దంతాలపై రాపిడిని పెంచి, పళ్లు బలహీనపడటానికి దారితీస్తుంది. కొందరిలో పళ్లు దెబ్బతినడం, దవడ కండరాల నొప్పి, దంతాల సున్నితత్వం పెరగడం వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు.

దంత నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా రాత్రిపూట పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు నిద్రపోయే ముందు మౌత్ గార్డ్ వాడటం వల్ల పళ్లను రక్షించుకోవచ్చు. అలాగే సమస్య తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.

ఇక ఒత్తిడిని నియంత్రించడం కూడా అంతే ముఖ్యమైన విషయం. రోజువారీ జీవితంలో కొద్దిపాటి మార్పులు చేస్తే స్ట్రెస్‌ను తగ్గించుకోవచ్చు. వ్యాయామం, యోగా, ధ్యానం, దీపంగా శ్వాస తీసుకోవడం వంటి అలవాట్లు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అదనంగా, ఇష్టమైన పనులు చేయడం, వినోదాత్మక కార్యక్రమాలు చూడడం వంటి చర్యలు కూడా ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.

మొత్తంగా చూస్తే, ఒత్తిడి ప్రభావం మనం ఊహించిందే కంటే ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆరోగ్యంతో పాటు దంతాలపై కూడా దాని ప్రభావం ఉంటుందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. కాబట్టి స్ట్రెస్‌ను నియంత్రించడం, అవసరమైతే వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను ముందుగానే నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Swathi N

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago