కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా(కేఎస్ఆర్టీసీ) సంస్థకు కర్ణాటక హైకోర్టు కీలక ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు షాక్ అయ్యారు. ఇంతకు ఆ ఉత్తర్వులో ఏముందంటే.. ఎవరికైనా ఒంటరిగా లేదా బోరింగ్ గా అనిపించినప్పడు మొబైల్ దగ్గరే ఉంటుంది కాబట్టి పాటలు వింటుంటాం.
అందులో కొందరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే.. మరికొందరు స్పీకర్ పెట్టి బయటకు వినిపించే విధంగా ప్లే చేస్తారు. దీని వల్ల పక్కన ఉన్న వ్యక్తులు ఎక్కువగా అసహనానికి గురవుతారు. ఆ సమయంలో ఆ విధంగా వ్యవహరిస్తున్న మనిషిని చూస్తే విపరీతమైన కోపం వస్తుంది.. కానీ అతడిని మనం ఏం అనలేని పరిస్థితి.
కానీ ఇక నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి పనులు చేస్తే.. నిర్దాక్షణ్యంగా కండక్టర్ అతడిని దించే అధికారాన్ని ఇచ్చింది హైకోర్టు. దీని వల్ల బస్సులో ఉండే వాతావరణం చెడిపోవడమే కాకుండా.. మరో వ్యక్తి తీవ్ర ఇబ్బందులకు గురవుతాడు. అందుకే హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
అంతకముందే దీనిపై రిట్ పిటిషన్ కోర్టులో దాఖలు అయింది. ఇవాళ దీనిపై కోర్టు తీర్పును వెలువరించింది. ఇక నుంచి సహ ప్రయాణికుడిని ఇబ్బంది కలిగించేలా అధిక సౌండ్లు పెట్టి పాటలు ప్లే చేస్తే.. ఇక అతడిని అక్కడే దించేస్తారు. ఈ సూచనలు ప్రతీ ఒక్కరూ పాటించాలని హైకోర్టు తెలిపింది. ఇవి పాటించకపోతే చర్యలు మరోలా ఉంటాయని హెచ్చిరించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…