Samantha: సమంత.. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ బిజీ అయింది. వరసగా సినిమాలు చేస్తూనే… వెకెషన్ కోసం పలు ప్రాంతాలకు వెళ్తోంది. తన వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.
విడాకుల అనంతరం కొన్ని రోజుల వరకు డిప్రెషన్ గా కనిపించిన సమంత.. మరింతగా స్ట్రాంగ్ అయింది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్, కామెంట్లపై ఘాటుగానే స్పందిస్తోంది. నెటిజెన్ల వెకిలి ప్రశ్నలకు అంతే ధీటుగా జవాబు ఇస్తోంది.
మరోవైపు విడాకుల అనంతరం చేసిన పుష్పలోని ‘ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’’ ఐటెం సాంగ్ తో భారీగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ దక్కించుకోవడమే కాదు.. పుష్ప సినిమా సక్సెస్ కు తోడైంది. దీని తర్వాత.. గుణ శేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ పేరుతో ప్యాన్ ఇండియా సినిమా చేస్తోంది. దీంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ‘ యశోద’ సినిమా చేస్తోంది. ఇక తమిళంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కాంబోలో ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా వస్తోంది.
ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటోంది సమంత. నిన్న ఇన్ స్టా గ్రామ్ లో క్వశ్చన్ అవర్ నిర్వ హించింది సామ్. తనను ఎలాంటి క్వశ్చన్స్ ను అడుక్కోవచ్చని పేర్కొంది. దీంతో ఓ నెటిజెన్ ఎవరూ అడగకూడని ప్రశ్న అడిగాడు. ”నువ్వు ప్రెగ్నెం టా? కాకపోతే.. నేను నిన్న ప్రెగ్నెం ట్ చేస్తా” ఇంగ్లీష్ లో కామెంట్ చేశాడు. దీనిపై సమంత కూడా సీరియస్ గానే స్పందించింది. మొదటగా నువ్వు.. ‘reproduce’ అనే పదానికి అర్థం తెలుసుకో.. అసలు ‘reproduce’ అనే పదాన్ని ఎక్కడా వాడుతారో తెలుసుకో అంటూ స్ట్రాం గ్ కౌంటర్ ఇచ్చింది సమంత. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…