Ariyana Glory: అరియానా పరిచయం అవసరం లేని పేరు. కెరియర్ మొదట్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసినటువంటి ఈమె ప్రస్తుతం సెలెబ్రెటీగా మారిపోయారు. ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసినటువంటి అరియానా సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ కారణంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.
ఈ బోల్డ్ ఇంటర్వ్యూలో వీరిద్దరూ ఏ మాత్రం తగ్గకుండా చేసినటువంటి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈమె ఫేమస్ కావడంతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో కూడా తనెంటో ప్రూఫ్ చేసుకోవడంతో ఈమెకు మరింత మంది అభిమానులుగా మారిపోయారు. ఇలా రోజురోజుకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అరియానా ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతోనూ సినిమాలతోనూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి స్టార్ మా నిర్వహిస్తున్నటువంటి బిబి జోడి కార్యక్రమంలో భాగంగా ఈమె ముక్కు అవినాష్ తో కలిసి సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ పర్ఫార్మ్ చేస్తున్న క్రమంలో ముక్కు అవినాష్ కారణంగా తన చేతికి గాయం తగిలిందని ఆ గాయాన్ని చూపిస్తూ అరియానా చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విషయంపై స్పందించిన అరియానా మిస్టర్ ముక్కు అవినాష్ గారు చూడండి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీ పక్క ఉన్న వారి గురించి కూడా కాస్త పట్టించుకోండి మీరు 100% ఫర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే అవతలి వాళ్లు ఎలా బలవుతారో కాస్త చూడండి. మీ పర్ఫామెన్స్ కారణంగా నా చేతికి దెబ్బ తగిలి ఎలా కమిలిపోయిందో చూడండి దీనిని నేను ఖండిస్తున్నాను అవినాష్ గారు అంటూ ఈ సందర్భంగా ఇమేజ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇటీవల భారతీయ వీధి ఆహారాల్లో మోమోస్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఈ…
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రతకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఆలయ సరుకుల దుర్వినియోగంపై…
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చల్లదనం కోసం సహజ పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల…
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అలియా భట్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో జోరుగా…
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఒక విచిత్ర ఘటన తాజాగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి బంధం మొదలైన తొలి రాత్రే భారీ…
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికు భక్తులు పెద్దఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన…