టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చిన అరియానా ఆ తరువాత బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అరియానా బిగ్ బాస్ షోలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచారు. ఈ క్రమంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చిన అరియానాకి విశేష ఆదరణ లభించింది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అరియానాకి వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి.అదే విధంగా పలు సినిమాలలో నటించే అవకాశాన్ని సంపాదించుకొని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అరియానా అవినాష్ నిపెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా బలంగా వినిపించడంతో నిత్యం వార్తలలో ఉండేది.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉండే అరియానా తాజాగా కొత్త ఇంట్లోకి మారమని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలిపారు. బుధవారం కొత్త ఇంటిలోకి మారాము. ఇల్లంతా సామాన్లతో చిందరవందరగా ఉంది. ప్రస్తుతం మా పరిస్థితి ఇది ఫ్రెండ్స్ అంటూ.. ఇన్స్టా స్టోరీస్ లో వీడియోలు షేర్ చేసింది.
బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అరియానాతో పాటు, ఎంతో ఫేమస్ అయిన చింటూ ఫోటోలు కూడా షేర్ చేస్తూ.. ఎన్నో రోజుల తర్వాత దర్శనం దొరికిందని కామెంట్ చేశారు.అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే కొందరు కొత్త ఇంటిని కొన్నావా… లేక అద్దె ఇంటికి మారారా అంటూ తమదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ కామెంట్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…