Featured

Arjun Kapoor : బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ పై హీరో ఆవేదన… ముందే పట్టించుకుని ఉంటే నష్టం జరిగి ఉండేది కాదు : అర్జున్ కపూర్

Arjun Kapoor : ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న సమస్య ప్రేక్షకులకు వాళ్ళు తీస్తున్న సినిమాలు నచ్చడం లేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్లాప్ అవుతున్నాయి. పెద్ద స్టార్ హీరో ఉన్నా సినిమాకు మాత్రం జనాలు రావడం లేదు. బాలీవుడ్ లో రోజూ ఎన్నో సినిమాలు వస్తుంటాయి అందులో ఒక్కటి కూడా ప్రేక్షకులకు నచ్చకపోవడం ఏంటి అనే సందేహం మొదలయింది. అయితే దీనికి ప్రధాన కారణాలు బాలీవుడ్ హీరోల మీద అక్కడి ప్రేక్షకులకు విసుగు రావడమే. వెస్ట్రన్ సంస్కృతికి మేమే వారసులం అన్నట్లుగా పాశ్చాత్య సంస్కృతిని నరనరానా బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కించుకోవడం, హిందూ వ్యతిరేక కామెంట్స్ కి మద్దతు ఇవ్వడం వంటివి అక్కడి జనాలకు రుచించడం లేదు.

బాయ్ కాట్ బాలీవుడ్… సుశాంత్ మరణం నుండే మొదలు…

బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత కోపం తెప్పించిన సంఘటన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. నెపోటిజం కి బలైపోయిన సుశాంత్ కోసం అప్పట్లో బాయ్ కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ మొదలయింది. సుశాంత్ మరణించినపుడు ఒక్క టాప్ హీరో కూడా బాలీవుడ్ లో స్పందించలేదు. ఇది జనాలకు ఇంకా కోపాన్ని కలిగించింది. అప్పటి నుండి ట్రెండ్ అవుతున్న ఈ బాయ్ కాట్ బాలీవుడ్ ఇప్పటికి కొనసాగుతోంది. ఏ సినిమా విడుదలైన బాయ్ కాట్ బాలీవుడ్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తోంది. మొన్న అమీర్ ఖాన్ లా సింగ్ చద్ధ, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ కి కూడా ఈ సెగ తగిలింది. ఈ ఇష్యూ మీద ఇపుడు నిర్మాత బోని కపూర్ కొడుకు అర్జున్ కపూర్ స్పందించాడు. కొంత మంది కావాలనే ఇలా బాయ్ కాట్ ట్రెండ్ ని చేస్తున్నారంటూ మండిపడ్డాడు.

మొదట్లోనే దీని గురించి అలోచించి చర్యలు తీసుకుని ఉంటే ఇంత నష్టం జరిగివుండేది కాదంటూ మాట్లాడాడు. మేమే తప్పు చేసాం పట్టించుకోక పోవడంతో దానిని అవకాశంగా తీసుకుని ఇలా పని గట్టుకుని చేస్తున్నారంటూ విరుచుకుపడ్డాడు. మౌనంగా ఉంటే దాన్ని చేతగానితనం లాగా చూస్తున్నారు అంటూ ఫైర్ అయిపోయాడు. బాలీవుడ్ నటులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తూ, హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ చేస్తూ బాలీవుడ్ నటులపై బురద జల్లుతున్నారని ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాడు. ఇక ఈ మాటలపై నెటిజన్స్ కూడా స్పందించారు. ఎవరీ అర్జున్ కపూర్ అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఎవరీ అర్జున్ కపూర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మీ కోసం పని మానుకుని, పని గట్టుకుని మీ టాలెంట్ ను ఆపేంత పిచోళ్లమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago