Malaika-Arjunkapoor: ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన అర్జున్ కపూర్..! ఇన్ స్టా ఫోటో వైరల్!
Malaika-Arjunkapoor: అర్జున్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేసి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇటీవల మలైకా అరోరాతో అర్జున్ కపూర్ విడిపోయారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. మలైకాతో దిగిన ఫొటోను షేర్ చేసి
పుకార్లకు ముగింపు పలికారు.
లిఫ్ట్‌లో తీసినట్లుగా కనిపించే ఈ చిత్రంలో జంట అద్దం సెల్ఫీకి పోజులిచ్చింది. అర్జున్, మలైకా సన్ గ్లాసెస్‌తో పాటు సాధారణ దుస్తులను ధరించి కనిపించారు. ఈ చిత్రాన్ని ఇన్ స్టాలో అతడు పోస్టు చేస్తూ.. ఇలా రాశాడు. “నీచమైన పుకార్లకు చోటు లేదు. సురక్షితంగా ఉండండి. లవ్ యూ ఆల్ అంటూ క్యాప్షన్ తో కూడా ఫొటోను షేర్ చేశాడు.
దాంతో పాటు ఎమోజీలను కూడా పంచుకున్నాడు. అసలు ఈ పుకార్లు ఎక్కువగ అవ్వడానికి గల కారణం ఏంటంటే.. మలైకా అరోరాకు నాలుగు పదుల వయస్సు వచ్చినా కానీ.. ఆమె అందం, అభినయంతో కుర్రకారులకు మత్తెక్కిస్తుంది.
అయితే ఆమె కంటే 12 ఏళ్ల చిన్న వాడైన అర్జున్ కపూర్ తో గత కొంత కాలంగా సహజీనవం చేస్తోంది. అయితే వాళ్లిద్దరకు గత వారం రోజుల కిందట విడిపోయారేనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. ఆరు రోజుల నుంచి.. మలైకా తన ఇంటి నుంచి బయటకు రాలేదు. అర్జున్ కపూర్ తో విడిపోయింది కాబట్టి.. ఆమె అర్జున్ తో కలవడం లేదనే పుకార్లు వచ్చాయి. అర్జున్ మూడు రోజుల క్రితం సోదరి రియా కపూర్ ఇంట్లో విందులో కనిపించాడు. రియా ఇల్లు మలైకా ఇంటికి చాలా దగ్గరలో ఉంది . అయినా అతను రాత్రి భోజనం తర్వాత వెళ్లి ఆమెను కలవలేదు. మలైకా సాధారణంగా ఈ ఫ్యామిలీ డిన్నర్‌లకు అర్జున్‌తో హాజరవుతుంది కానీ ఈసారి ఆమె అతనితో కనిపించలేదు దీంతో అనుమానాలు వచ్చాయి. చివరకు ఆ అనుమానాలు నిజం కావని ఒక్కఫొటోతో క్లారిటీ ఇచ్చేశాడు అర్జున్ కపూర్. మలైకా గతంలో నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వారు 1998 నుండి 2016 వరకు వివాహం చేసుకున్నారు అంతే కాదు వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…