Artist Rachana : చేసింది చిన్న క్యారెక్టర్ అయినా సినిమా మొత్తంలో ఒక్క క్షణం అలా కనిపించి పోయినా కొన్ని క్యారెక్టర్లు మనల్ని థియేటర్ బయటికి వచ్చాక కూడా వెంటాడుతాయి. ఆ పాత్ర వేసిన వారిని గుర్తు పెట్టుకునేలా చేస్తాయి. అలా ఒక్క సీన్ లో నటించినా సినిమా వచ్చి పదేళ్ళైనా ఇప్పటికీ సినిమాలో ఆ క్యారెక్టర్ ను గుర్తు పెట్టుకుని ఆ అమ్మాయిని అడుగుతున్నారట. తాను ఎవరో కాదు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో చిన్న అమ్మాయిగా సమంత కజిన్ గా నటించిన రచన.
కులేక్కలేదా వాటరు…
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కుటుంబ నేపథ్యంలో సాగే కథ. అందులో కోస్తా ఆంధ్ర యాస ప్రధానంగా ఆకట్టుకుంటుంది. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా హోటల్ లో ‘ఏంటి వాటర్ ఇంకా కూలెక్కలేదా’ అంటూ సాగే డైలాగును చెప్పి ఆకట్టుకున్న రచన పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినా అమ్మమ్మ ఊరు తణుకు కావడం వల్ల ఆ యాస బాగా వచ్చు. ఇక ఆ సినిమాలో అవకాశం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు రచన.
ఆ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తనకు మేనమామ కావడం వల్ల ఒకసారి ఏదో పెళ్ళిలో వాటర్ కూల్ గా ఉన్నాయా లేవా అని మావయ్య అడిగితే ఇంకా కులెక్కలేదా అంటూ ఆ సినిమా డైలాగు లాగే చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వారు. దాంతో ఆ సీన్ సినిమాలో పెట్టాలని మావయ్య అనుకున్నారు. నువ్వైతేనే కరెక్ట్ గా చేస్తావ్ నువ్వే చేయి అని చెప్పి చేయించారు అంటూ చెప్పింది రచన. అయితే ఆ సినిమా తరువాత ‘అత్తారింటికి దారేది’ వంటి పెద్ధ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చినా గ్యాప్ ఇచ్చి మంచి ఎంట్రీ ఇవ్వాలనినుకుని చేయలేదని ఇంటర్వ్యూలో పంచుకుంది రచన.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…