Artist Tulasi : చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి హీరోయిన్ గా అలాగే ఇక హీరో చెల్లి పాత్ర అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లిగా మెప్పించిన నటి తులసి, మూడువందలకు పైగా సినిమాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు అందరు అగ్ర హీరోలా సినిమాల్లో నటించిన తులసి అందరు గొప్ప దర్శకుతో పనిచెయడం గొప్పగా ఉంటుంది అంటూ చెప్తున్నారు. ఇక సినిమాల్లో కే విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది అందునా శంకరాభరణం సినిమాలో శంకర్ శాస్త్రి వద్ద అబ్బాయిగా తులసి నటన అందరినీ అక్కట్టుకుంటుంది. ఆ ఒక్క సినిమాతో నటనలో వంద మెట్లు ఎక్కేసింది తులసి. ఇక ఈ మధ్యనే విడుదల అయిన కార్తికేయ 2 సినిమాలో కూడా తన నటనతో అందరినీ మరోసారి ఆకట్టుకున్నారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ నుండి నేటి అమ్మ క్యారెక్టర్స్ వరకు ఆమె ఎంతో మంది స్టార్స్ తో నటించింది.
ఎన్ని కోట్లు సంపాదించానంటే…
తులసి గారు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి సీనియర్ హీరోలతోను అలాగే సమకాలిన నటులతోను ఇప్పుడు కుర్ర హీరోలకు తల్లిగాను నటిస్తూ మెప్పిస్తున్నారు. తులసి గారి సినిమా జీవితం పక్కనపెడితే ఆమె వ్యక్తిగతంగా సాయి బాబా భక్తురాలు, ఆమె తన తాత గారి పెంపకంలో పెరగడం ఆయన వ్యక్తిత్వ ప్రభావం ఎక్కువగా ఆమెపై ఉంది. ఆమె తన చిన్నతనంలోనే బాబా భక్తుడినే పెళ్లి చేసుకుంటా అని చెప్పేదట.
అలానే తాను ఒక కన్నడ సినిమాలో నటించడానికి వెళితే ఆ సినిమా డైరెక్టర్ శివమణితో పరిచయం ఏర్పడి సాయంత్రమే పెళ్లి చేసేసుకున్నారట. ఒక పేదవాడిని నేను పెళ్లి చేసుకున్నాను, ఆస్తుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. బాబా దయవల్ల బాగానే ఉంది నాకు ఆస్తి అంటూ నా కొడుకు సాయి తరుణ్ అంటూ వాడు ఇప్పుడు డైరెక్టర్ గా అడుగుపెట్టాడు అని చెప్పారు. వాడి భవిష్యత్తు బాగుంటే చాలు ఆంటూ చెప్పారు. సినిమాకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఉండదని తెలిపారు. మొత్తానికి తన రెమ్యూనరేషన్ మాత్రం చెప్పలేదు తులసి గారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…