తెలుగు సినీ టెలివిజన్ లో ఈటీవీలో జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ లనుంచి ఎంతో మంది కమెడియన్స్ తమ టాలెంట్ ను నిరూపించుకొని సినిమాల్లో నటిస్తున్నారు. అలాంటి ప్రోగ్రాంకు ధీటుగా నిలబడేందుకు ఇటీవల జీ తెలుగులో నాగబాబు జడ్జిగా అదిరింది వచ్చింది.
తర్వాత మొదటి సీజన్ అయిపోయిందంటూ.. తర్వాత మళ్లీ మొదలు అవుతుందంటూ దానిని ఆపేశారు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 అయిపోయిన వెంటనే స్టార్ మాలో ‘కామెడీ స్టార్స్’ అనే కామెడీ ప్రోగ్రాం ను మొదలు పెట్టారు. ఇది కూడా జబర్దస్త్ కు ధీటుగా ఎదుర్కోడానికే పెట్టినట్లు సినీ వర్గాల టాక్.
కానీ అంత రేటింగ్ వస్తుందో.. రావడం లేదో తెలియదు గానీ.. ఇటీవల అందులో ఒక సందర్భం అందరినీ ఆకట్టుకుంది. అదేంటంటే.. ఎక్స్ ప్రెస్ హరి టీం ఇందులో కామెడీ స్కిట్ లు చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి హరికి.. అషురెడ్డికి మధ్య లవ్ ఉన్నట్లు చూపిస్తున్నారు. వీరిద్దరి మధ్య ముద్దులు హగ్‌లే కాదు.. ఏకంగా అషురెడ్డి పేరుని తన గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకుని తన ప్రేమను వ్యక్తపరిచాడు.
అప్పటి నుంచి వీళ్ల మధ్య లవ్ ట్రాక్ జెట్ స్పీడ్‌తో దూసుకుని పోతుంది. ఈ మధ్య మళ్లీ అషురెడ్డి కొన్నాళ్లు కనిపించలేదు. తర్వాత మళ్లీ ఓ స్కిట్ లో ప్రత్యక్షమైంది అషు. అంతేకాదు.. హరికి ఓ బంపర్ గిఫ్ట్ కూడా ఇచ్చేసింది. అదేంటంటే.. లక్షలు విలువ చేసే ఖరీదైన స్పోర్ట్స్ బైక్ అది. ఇది చూడగానే హరి ఆశ్చర్యంతో.. తన అమ్మానాన్నలు కూడా ఇలా చేయలేదు..థ్యాంక్యూ అంటూ అషురెడ్డిని వెళ్లి హగ్ చేసకుంటాడు. జడ్జిలు మాత్రం.. మీరిద్దరు ఇలానే స్నేహితులుగా ఉండాలంటూ దీవిస్తారు. ఇలా హరి అక్కడ భావోద్వాగానికి గురవుతాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…