తెలుగు సినీ టెలివిజన్ లో ప్రస్తుతం ఎటర్ టైన్ మెంట్ విషయంలో ఈటీవీకి తిరుగులేదనే చెప్పాలి. జబర్దస్త్ నుంచి ఎక్స్ ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీలతో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. ప్రతీ వారం ఎదో ఒక కొత్తగా చేస్తూ టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులను అలరిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇటీవల బాగా పాపులారిటీ తెచ్చుకుంది.
అందులో ప్రతీ వారం.. సాహసానికి సంబంధించి ఏదో ఒక విన్యాసాన్ని చూపిస్తుంటారు. లేదా సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి స్కిట్ చేసి చూపిస్తారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈసారి ఓల్టేజ్ హోంలో ఉన్న వృద్దులను ఈ షోకి తీసుకొచ్చారు.
ఇలా ఓ వృద్ధాశ్రమం నుంచి కొంత మందిని తీసుకువచ్చారు. ఆ ఆశ్రమం నడిపే నిర్వాహకురాలు కూడా ఆ షోకి వచ్చారు. అయితే అక్కడ వాళ్లు చెప్పే బాధలు.. కన్నీటి కథలు ప్రతీ ఒక్కరినీ కదిలించాయి. సుడిగాలి సుధీర్ అయితే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇంద్రజ కూడా వాళ్ల విషాద కథలను వింటూ చలించిపోయారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఇలా వృద్ధాశ్రమంలో ఉంచడం ఏ మాత్రం కరెక్ట్ కాదని.. ఆ బాధ తల్లి, తండ్రి లేని వారికి తెలుస్తుందని కన్నీరు పెట్టుకున్నారు.
అయితే వాళ్ల కన్నీటి కష్టాలకు తమవంతు సాయం అందిస్తామంటూ.. వర్ష, భాను రూ.లక్ష విరాళంగా అందించారు. అందులో వర్ష చెక్కును అందజేయగా.. భాను డబ్బులను ఇచ్చారు. ఈ సందర్భంగా వర్ష అక్కడే ఓ పెద్దావిడ కాళ్ళకు నమస్కరించారు. అంతేకాదు ఇంద్రజ వాళ్ల తిండికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు. ఇలా నవ్వించడమే కాదు.. మాకు సహాయం చేసే గుణం ఉందంటూ నిరూపించారు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో పాల్గొనె కమెడియన్స్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…