Chinna Jeeyar Swamy: సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్ముకొనే వెధవ అంటూ చిన్న జీయర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అశ్వినీదత్!
Chinna Jeeyar Swamy: తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలుగా నిలిచిన సమ్మక్క సారక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా జరుపుకునే సమ్మక్క సారక్కల జాతరకు ఎంతో మంది భక్తులు చేరుకుని అమ్మవారికి పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకుంటారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే సమ్మక్క సారక్కల గురించి చిన్న జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ గిరిజన దేవతలుగా ప్రసిద్ధి చెందిన సమ్మక-సారక్కలను వాళ్లు ఏమైనా దేవతలా? వారు బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చారా? వాళ్లు కేవలం వన దేవతలు, గ్రామ దేవతలు.గ్రామ దేవతలను అక్కడున్న వారు పూజించుకోడం తప్పులేదు కానీ వీరి పేరు చెప్పుకొని ఎంతో మంది వ్యాపారవేత్తలు, అక్కడ వ్యాపారాలు పెట్టి పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారంటూ సమ్మక్క సారక్కల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ విధంగా తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకలుగా భావించే అమ్మవారి గురించి అలా మాట్లాడటంతో తెలంగాణ గిరిజన నేతలు చిన్నజీయర్ స్వామి పై పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో న్యూస్ చానల్స్ ఏకంగా డిబేట్స్ కూడా పెట్టేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక న్యూస్ ఛానల్ పెట్టిన డిబేట్ లో భాగంగా నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారక్కల గురించి చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న జీయర్ స్వామిని వాడు వీడు అంటూ అగౌరవంగా మాట్లాడారు. నిజం చెప్పాలంటే చిన్న జీయర్ స్వామి గతంలో బ్లాక్ టికెట్లు అమ్ముకొని వెధవ… అతనిపై ఇలాంటి అభియోగాలు కూడా ఉన్నాయని మాట్లాడారు.సమ్మక్క సారక్కల పేర్లు చెప్పుకొని వ్యాపారం చేస్తున్నామా సమత మూర్తి విగ్రహాన్ని పెట్టుకుని మీరు చేసేది ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం నిర్మాత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…