Connect with us

General News

Chinna Jeeyar Swamy: సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్ముకొనే వెధవ అంటూ చిన్న జీయర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అశ్వినీదత్!

Chinna Jeeyar Swamy: తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలుగా నిలిచిన సమ్మక్క సారక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆసియా ఖండంలోనే

Published

on

Chinna Jeeyar Swamy: తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలుగా నిలిచిన సమ్మక్క సారక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా జరుపుకునే సమ్మక్క సారక్కల జాతరకు ఎంతో మంది భక్తులు చేరుకుని అమ్మవారికి పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకుంటారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే సమ్మక్క సారక్కల గురించి చిన్న జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Advertisement
Chinna Jeeyar Swamy: సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్ముకొనే వెధవ అంటూ చిన్న జీయర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అశ్వినీదత్!
Chinna Jeeyar Swamy: సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్ముకొనే వెధవ అంటూ చిన్న జీయర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అశ్వినీదత్!

తెలంగాణ గిరిజన దేవతలుగా ప్రసిద్ధి చెందిన సమ్మక-సారక్కలను వాళ్లు ఏమైనా దేవతలా? వారు బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చారా? వాళ్లు కేవలం వన దేవతలు, గ్రామ దేవతలు.గ్రామ దేవతలను అక్కడున్న వారు పూజించుకోడం తప్పులేదు కానీ వీరి పేరు చెప్పుకొని ఎంతో మంది వ్యాపారవేత్తలు, అక్కడ వ్యాపారాలు పెట్టి పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారంటూ సమ్మక్క సారక్కల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Chinna Jeeyar Swamy: సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్ముకొనే వెధవ అంటూ చిన్న జీయర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అశ్వినీదత్!
Chinna Jeeyar Swamy: సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్ముకొనే వెధవ అంటూ చిన్న జీయర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అశ్వినీదత్!

ఈ విధంగా తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకలుగా భావించే అమ్మవారి గురించి అలా మాట్లాడటంతో తెలంగాణ గిరిజన నేతలు చిన్నజీయర్ స్వామి పై పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో న్యూస్ చానల్స్ ఏకంగా డిబేట్స్ కూడా పెట్టేస్తున్నారు.

మీరు చేస్తున్నది వ్యాపారం కాదా…

ఈ క్రమంలోనే ఒక న్యూస్ ఛానల్ పెట్టిన డిబేట్ లో భాగంగా నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారక్కల గురించి చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న జీయర్ స్వామిని వాడు వీడు అంటూ అగౌరవంగా మాట్లాడారు. నిజం చెప్పాలంటే చిన్న జీయర్ స్వామి గతంలో బ్లాక్ టికెట్లు అమ్ముకొని వెధవ… అతనిపై ఇలాంటి అభియోగాలు కూడా ఉన్నాయని మాట్లాడారు.సమ్మక్క సారక్కల పేర్లు చెప్పుకొని వ్యాపారం చేస్తున్నామా సమత మూర్తి విగ్రహాన్ని పెట్టుకుని మీరు చేసేది ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం నిర్మాత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

devotional

Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!

Published

on

Koti Deepotsavam: 2012 నుంచి ఇప్పటివరకు అనగా దాదాపు 11 ఏళ్లుగా ఎన్టీవీ అలాగే భక్తి టీవీ చానల్స్ హైదరాబాద్ వేదికగా ప్రతి ఏడాది కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కన్నుల పండుగ అత్యంత వైభవంగా జరుగుతూ వస్తోంది. ఇక ఈ ఏడాది కూడా ఆ సమయానికి ఆసన్నమైంది. త్వరలోనే కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా మొదలుకానుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.

Advertisement

కాగా భక్తి టీవీ ఎన్ టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్తీక కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నిర్విరామంగా జరుగుతూ వస్తున్న ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రతి ఏడాది జరిగే లాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించడానికి ఈ సర్వం సిద్ధం చేశారు.

నవంబర్ 9 నుంచి ప్రారంభం..

ఇకపోతే కార్తీకమాసంలో జరిగే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం అంటే ఒక్కసారిగా ప్రజ్వలించే దీపాలు లక్షలాది మంది భక్తులు, ఒకేసారి ఒకే ప్రాంగణంలో ఉండడం. లక్షలాది దీపాలతో ఆ ప్రాంగణమంతా కూడా దీపాల వెలుగులతో విరిగిపోతూ ఉంటుంది. ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్‌ 9 న నుంచి నవంబర్ 25 వరకు హైదరాబాద్,ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి నగరం నలువైపుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అదేవిధంగా దేశ నలుమూలల నుండి సాధు పుంగవులు, మఠాధి పతులు, పీఠాధి పతులు, ప్రవచన కర్తలు, హైందవ సమాజ సేవకులు ఇలా వేలాది లక్షలాదిమంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?

Published

on

Ambulance: మనకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి సరైన సమయంలో చికిత్స అందడం కోసం అంబులెన్స్ కు ఫోన్ చేస్తాం వారు కూడా మన ప్రాణాలను నిలబెట్టడానికి వారి ప్రాణాలను కూడా లెక్కచేయరు కానీ ఓ అంబులెన్స్ డ్రైవర్ తన వృత్తిని మరిచిపోయి అంబులెన్స్ లో ఉన్నటువంటి ఓ మహిళ పట్ల లైంగిక వేధింపులకు దిగారు. దీంతో పేషంట్ గా ఉన్న ఆమె భర్త ప్రాణాలను వదిలిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Advertisement

పూర్తి వివరాలలోకి వెళ్తే..ఈ ఘటన లోరి ఘజిపుర్‌లో చోటుచేసుకుంది. మహిళ భర్త అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ తగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో తిరిగి తన భర్తను ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడి తన భర్తను అందులో ఎక్కించి ఇంటికి తీసుకు వెళుతున్నారు.

మార్గమధ్యమంలో అంబులెన్స్ డ్రైవర్ తన హెల్పర్ ఆ మహిళ పట్ల లైంగిక వేధింపులకు గురి చేశారు. తనని ముందు సీట్లో కూర్చోవాలని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించడంతో ఆంబులెన్స్ లో ఉన్నటువంటి తన భర్త తన సోదరుడు పెద్ద ఎత్తున అరవడంతో ఆంబులెన్స్ డ్రైవర్ ఆ మహిళ దగ్గర 10000 రూపాయలు విలువ చేసే బంగారం లాక్కొని పేషంటును మార్గమధ్యమంలోనే వదిలేసి ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు.

ఆక్సిజన్ తొలగించి..
ఇలా ఆక్సిజన్ తొలగించడంతో సదరు మహిళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అప్పటికే వేరే అంబులెన్స్ కు ఫోన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ తీరుపట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!

Published

on

Vijayawada Floods: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం నదులను తలపిస్తోంది. భారీగా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో ఎంతోమంది అవస్థలు పడుతున్నారు.

Advertisement

ఈ వరదల కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది. సరైన సమయంలో కనీసం తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ వరదలలో ఎంతో మంది ఇతరులను రక్షించి వారు ప్రాణాలను కోల్పోయిన సంఘటనలను మనం చూస్తున్నాము.

కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్‌(32)కు సింగ్‌నగర్‌లో డెయిరీఫాం ఉంది. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు మరో ఇద్దరు డైరీ ఫామ్ లో పనిచేసే వర్కర్లు ఈ వరదల్లో చిక్కుకున్నారు. అయితే ఆ నలుగురిని చంద్రశేఖర్ రక్షించారు. ఇక తన ఫామ్ లో 50ఆవులను తాళ్లతో కట్టేసి ఉంటే వాటన్నింటినీ కూడా విడదీసి తాను కూడా సురక్షితంగా బయటకు రావడం కోసం షెడ్ పైకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు.

నలుగురికి ప్రాణదానం..
ఇలా షెడ్ పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి కింద పడటంతో ఆయన వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. అయితే తన డైరీ ఫార్మ్ దగ్గరలోనే తన మృతదేహం కనిపించడంతో తన కుటుంబ సభ్యులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం కాగా ప్రస్తుతం తన భార్య 8 నెలల గర్భిణీ. ఇలా తమ ప్రాణాలను రక్షించి చంద్రశేఖర్ ప్రాణాలను కోల్పోవడంతో తన సోదరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!