Asin Wedding: సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొందరు ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు.ఇలా హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఆసిన్ సైతం ఇలాంటి కోవలోకి చెందుతారు.ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఉన్నఫలంగా వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు.
తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో గుర్తింపు పొందిన ఆసిన్ మైక్రోమ్యాక్స్ కో అధినేత రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్షయ్ కుమార్ తో కలిసి ఈమె నటించిన హౌస్ ఫుల్ 2సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాహుల్ శర్మను మొదటిసారి కలిశారు. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2016 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా వివాహమైన తర్వాత ఆసిన్ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా జన్మించారు.ఇకపోతే వివాహం ఎంతో ఘనంగా జరిగినప్పటికీ ఆమె బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ ఫుల్లుగా తాగి వచ్చి పార్టీలో మ్యూజిక్ బాగాలేదని లైటింగ్ బాగా లేదంటూ పెద్ద ఎత్తున గొడవ పెట్టుకున్నారు. ఇలా ఈయన గొడవ చేసేసరికి పార్టీ మూడు మొత్తం మారిపోయింది.రిషి కపూర్ ఈ విధంగా గొడవ పెట్టుకునేసరికి రాహుల్ శర్మ అతనితో మాట్లాడి గొడవసద్దమనిగేలా చేసినప్పటికీ, అప్పటికే కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు తిరిగి వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమం కేవలం ఒక గంట వ్యవధిలోనే ముగిసింది. ఈ విషయం అప్పట్లో పలు చర్చలకు దారి తీసిందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…