NTR -Ramcharan: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా సౌత్, నార్త్ ఇండుస్ట్రిస్ లో మాత్రమే కాకుండా విదేశాలలో కూడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేశాడు. ఇక ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాకి కీరవాణి అందించిన సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి కూడా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ టీమ్ జపాన్ లో సందడి చేశారు.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబంతో కలిసి జపాన్‌కు వెళ్లారు.
జపాన్ వీదుల్లో వీరందరూ సరదాగ తిరుగుతూ ఎంజాయ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ని రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాజాగా ఈ సినిమా జపాన్‌లో అక్టోబర్ 21 నవిడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎన్టీఆర్ రామ్ చరణ్ తమ భార్యలతో కలిసి జపాన్ వీధుల్లో నడుస్తున్న ఓ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో చేతుల్లో రోజా పువ్వులు పట్టుకొని, ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న వీడియోకు RRR సినిమాలోని దోస్తీ సాంగ్ యాడ్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్ లో రామ్ చరణ్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…