Featured

Astrologer Bharath Sharma : సాయి చంద్ కు ప్రాణగండం ఉందని ముందే హెచ్చరించాను…: ఆస్ట్రాలజర్ భరత్ శర్మ

Astrologer Bharath Sharma : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమం వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరచిన 39 ఏళ్ల సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. ఆయన గురించి ఆస్ట్రాలజర్ అలాగే సాయి చంద్ కు మిత్రుడైన భరత్ శర్మ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆయనకు ఆరోగ్యం గురించి ముందే హెచ్చరించాను…

భరత్ శర్మ మాట్లాడుతు సాయి చంద్ స్నేహానికి చాలా విలువ ఇస్తారంటూ చెప్పారు. ఒకసారి స్నేహం చేస్తే వారిని వదలడని పదకొండేళ్లుగా సాయి చంద్ తెలుసంటూ చెప్పారు. ఆయన మొదట జాతకాలు, దేవుళ్లను పెద్దగా పట్టించుకునేవారు కాదు. కరోనా తరువాత ఒకసారి కలవాలని చెప్పి నేను ఎమ్మెల్సి కి ట్రై చేస్తున్నా అవుతుందా అని అడిగాడు. జాతకం చూసి ఇప్పుడు రాదని చెబితే జాతకాలను నమ్మనని, నేను చెప్పింది తప్పవుతుందని ఛాలెంజ్ చేసాడు. కానీ ఎమ్మెల్సి రాకపోయే సరికి మళ్ళీ ఒకసారి పూర్తి జాతకం చూపించుకుంటాను జీవితంలో క్లారిటీ లేదని చెప్పాడు.

అప్పుడు జాతకం చూసి ఆయనకు రాజకీయాలలో అధికారం పొందే అవకాశం కన్నా అధికారం ఉన్న వాళ్ళ కింద పనులు చేసే అవకాశం కనిపిస్తోందని, ప్రస్తుతం తన జాతకం ప్రకారం రాజకీయాల గురించి ఆలోచించడం కంటే ఆరోగ్యం గురించి ఆలోచించాలని చెప్పాను. నరాలకు సంబంధించి రక్తానికి సంబంధించి అలాగే చర్మానికి సంబంధించి జాగ్రత తీసుకోవాలని చెప్పినట్లు చెప్పారు. కొన్ని ఆలయాల సందర్శన అనుకున్నాం కానీ సాయి చంద్ మీటింగ్స్ వల్ల బిజీగా ఉండటంతో కుదరలేదు. ఇంతలో ఇలా అయిపోయింది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago