Featured

Astrologer Venu swamy : ఆతను పప్పు కాదు… నిప్పు గా మారబోతున్నాడు…: ఆస్ట్రాలజర్ వేణు స్వామి

Astrologer Venu swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకుని తిరిగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత, నాగచైతన్య పెళ్లి సమయంలో వాళ్ళు విడిపోతారని చెప్పారు. ఇక రష్మిక తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిందే నేనేనని తనతో వాళ్ళింట్లో ప్రత్యేక పూజలు కూడా చేసానంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ కూతురు శ్రీజది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదంటూ మూడో పెళ్లి చెసుకుంటుందంటూ మాట్లాడాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వైరల్ అవుతూ ఉండే వేణు స్వామి ఇటీవల ఒక స్టార్ హీరో చనిపోతాడని అలాగే ఒక హీరోయిన్ కి అనారోగ్యం వస్తుందని చెప్పాడు. ఇక ఇప్పుడు మరోసారి ఇద్దరు టాప్ హీరోలు చనిపోతారంటూ చెప్తున్నాడు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు…

వేణుస్వామి గతంలోనే రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాడు అంటూ చెప్పారు. ఆయన ప్రధాని పీఠం మీద కూర్చోలేడని అలాగే పెళ్లి యోగం కూడా లేదని చెప్పారు. అయితే ఇపుడు వేణుస్వామి తాజాగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ పప్పు అంటూ రాహుల్ గాంధీని అందరూ విమర్శిస్తారు. కానీ తాను మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చాడు. రేపు రాబోయే ఎన్నికలలో కూడా దేశంలో కీలకం అవుతాడు.

తాను అధికారంలోకి రాకపోవచ్చు కానీ రాజకియంగా కీలకం కానున్నాడు అంటూ వేణుస్వామి తెలిపారు. తెలంగాణ లో వచ్చే ఎన్నికలలో పోటీ బిఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య ఉండబోతోంది. ఇక బీజేపీ మూడో స్థానములో ఉంటుంది అంటూ చెప్పారు. ఇక జగన్ అధికారంకి తిరుగులేదు కానీ ఎల్లపుడు జనం చేత తిట్టించుకోబడతాడు. అదే పవన్ విషయంలో సభ పెడితే ఇసక రాలనంత జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం రావు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago