Featured

Astrologer Venuswami : ఆస్ట్రాలజర్ వేణు స్వామి భార్య ఒక సెలబ్రిటీ అని తెలుసా… ప్రేమ కథ గురించి మొదటి సారి చెప్పిన వేణుస్వామి…!

Astrologer Venuswamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకుని తిరిగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత నాగచైతన్య విడిపోయాక వాళ్ళు విడిపోతారని నేను ముందే చెప్పానని అన్నాడు. ఇక రష్మిక తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిందే నేనేనని తనతో వాళ్ళింట్లో ప్రత్యేక పూజలు కూడా చేసానంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ కూతురు శ్రీజది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదంటూ మూడో పెళ్లి చెసుకుంటుందంటూ మాట్లాడాడు. వివాదాస్పద వాఖ్యలు చేస్తూ నిత్యం వైరల్ అవుతూ ఉండే వేణు స్వామి ఇటీవల మద్యం, మాంసం గురించి మాట్లాడిన మాటలకు పెద్ద చర్చే జరిగింది. అలాంటి వేణు స్వామి లైఫ్ లో ఒక ప్రేమకథ ఉందని తెలుసా… తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన లవ్ స్టోరీ ఆయన భార్య ఎవరో వేణు స్వామి తెలిపారు.

వీణా శ్రీవాణి భర్త వేణు స్వామి…

వీణ శ్రీవాణి అనగానే ఇప్పుడొస్తున్న మోడరన్ సాంగ్స్ ని కూడా తన వీణతో అత్యంత అద్భుతంగా పలికించే వీణ వాద్యకారిణిగా అందరికీ సుపరిచితురాలే. ఆమె తన వీణతో మీటే ఎన్నో రాగాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఆమె ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి భార్య. వేణు స్వామి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. 2002 లో వివాహం చేసుకున్నానని, మాది ప్రేమ వివాహం అంటూ చెప్పారు.

శ్రీవాణి గారు వీణ నేర్పించేటపుడు ఆమెను తొలిసారి చూసి ప్రేమించేసానని వెంటనే పెళ్లి చేసుకుందామని అడిగానని చెప్పారు. అప్పుడు కూడా ఇంకాస్త బొద్దు గానే ఉన్న తాను నన్ను ఇష్టపడిందని అదీ కాక ఆ సమయంలో కెరీర్ పరంగా నేను జీరో కన్నా తక్కువలోనే ఉన్నా నన్ను నన్నుగా ఇష్టపడిందని భార్య శ్రీవాణి గురించి చెప్పారు. వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నాతో కలిసి నడిచిందని వేణుస్వామి తెలిపారు. పెళ్లి జరిగి ఇన్నేళ్ళైనా ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆమెను అంగీకరించలేదని, ఆమెకు వారి గురించి ఏమాత్రం మాట్లాడదని చెప్పారు. తాను అందం చూసి కాకుండా నా మనసును చూసి ప్రేమించిందని అలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago