Movie News

Mamatha mohandas: రాజమౌళి గారు అలా అనడంతో గుండె ఆగినంత పని అయింది… పెద్ద తప్పు చేశాను: మమత మోహన్ దాస్

Mamatha mohandas: మమతా మోహన్ దాస్ తెలుగులో యమదొంగ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఈ సినిమాతో ఎంతో మంచి సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో నటించారు. అయితే ఈమె క్యాన్సర్ బారిన పడటంతో సినిమాలకు కాస్త దూరమయ్యారు. ఇలా రెండుసార్లు క్యాన్సర్ నుంచి బయటపడినటువంటి ఈమె ప్రస్తుతం బొల్లి వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు.

ఇలా తనని ఎన్ని సమస్యలు వెంటాడినా ఎంతో ధైర్యంతో ఈమె ముందడుగు వేస్తూ ఒకవైపు సినిమాలు మరోవైపు తన ఆరోగ్యాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే మమతా మోహన్ దాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలియజేశారు.

ఇక ఈమె అరుంధతి సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయం గురించి మమత మోహన్ దాస్ మాట్లాడుతూ… తనకు తెలుగు ప్రొడక్షన్స్ గురించి పెద్దగా అవగాహన లేదు. అయితే శ్యాం ప్రసాద్ రెడ్డి గారు తనకు అరుంధతి సినిమాలో అవకాశం కల్పించారు కానీ వారి ప్రొడక్షన్ మంచిది కాదని తన మేనేజర్ చెప్పడంతో నేను ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.

Mamatha mohandas:

నాకోసం శ్యాం ప్రసాద్ రెడ్డి గారు దాదాపు 3 నెలల వరకు ఎదురు చూసారని అయితే నేను తప్పుకోవడంతో అనుష్క ఈ సినిమాలో నటించారని తెలిపారు.ఈ సినిమా నుంచి తప్పుకొని రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాకు కమిట్ అయ్యాను. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి గారు మాట్లాడుతూ అరుంధతి సినిమా వదులుకొని పెద్ద తప్పు చేసారని అనడంతో ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయింది. అయితే అప్పటికి ఇంకా అరుంధతి సినిమా విడుదల కాలేదు. ఇక ఈ సినిమా విడుదలయి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.సినిమా గురించి రాజమౌళి గురించి మమతా మోహన్ దాస్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago