Sukumar: ఆ టైంలో రజినీకాంత్ ను సర్.. సర్ అంటూ వణికిపోయా..ఆ ఘటనను మర్చిపోలేను: సుకుమార్
Sukumar: ఐకాన్ స్టార్ బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో పెద్ద హిట్ అయింది. టాలీవుడ్ నుంచే కాకుండా… బాలీవుడ్ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు.
ఇక లెక్కల మాస్టార్ గా పేరున్న సుకుమార్.. ఎన్నో చిత్రాలను తెరెక్కించిన విషయం తెలిసిందే. ఆర్య సినిమాతో అతడి జర్నీ మొదలై.. పుష్ప సినిమా వరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. సుకుమార్ ఇటీవల తమిళ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి రోజుల గురించి మాట్లాడారు.
అతడికి సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. రోబో చిత్రం షూటింగ్ సమయంలో రజనీకాంత్ ను చూశానని.. షూటింగ్ చూడటానికి వెల్లినప్పుడు.. రజనీ కాంత్ నా దగ్గరకు వచ్చాడని.. ఆ సమయంలో అతడు ఆర్య సినిమా చూసి.. ఆ సినిమా గురించి మాట్లాడారని తెలిపాడు. అతడు తన దగ్గరకు వస్తున్న సమయంలో వణుకుతూ.. సర్ సర్ అంటూ చేతులు కట్టుకొని నిలబడ్డానన్నాడు. ఆర్యలో హీరోయిన్ హెయిర్ ఊడుతూ పడిపోయే సీన్ బాగుందన్నారు.
ఈ డిస్కషన్ జరుగుతున్న సమయంలో రోబో సినిమా షాట్ రెడీ అవ్వడంతో అతడు వెళ్తుండగా.. లేచానన్నాడు. అతడు మళ్లీ వెనుకకు వచ్చి.. కూర్చొమన్నాడు. . అయినా నేను కూర్చోకపోయే సరికి.. ఠక్కున అలావెళ్లి కుర్చీ తీసుకొచ్చి వేసి.. ఆయన ముందు కూర్చొమన్నాడు. ఇలా నా కోసం కూర్చి తీసుకొచ్చి కూర్చొండి అని అనడం లైఫ్ లో మర్చిపోను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకు మణిరత్నం అంటే ఎంతో ఇష్టమని.. అతడికి తాను వీర అభిమానిని అంటూ చెప్పాడు. ఆయన తీసిన గీతాంజలి సినిమా బాగా ఇష్టమని.. ఆ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు.. ఒక లవర్ ను వదిలేసి వస్తున్నట్లు అనిపించిందన్నారు. అయితే ఇంతవరకు అతడికి కలవడం కుదరలేదన్నాడు. తమిళ చిత్రం విక్రమ్ వేద , రాచసన్ సినిమాలను రిమేక్ లో తీయాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చాడు. తనకు థ్రిల్లర్ జోనర్ లో సినిమాలు తీయాలనే ఆశ ఎక్కువగా ఉందన్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…