Featured

Atiq ahmed Murder Case : భర్తనే మించిపోయిన లేడీ గ్యాంగ్స్టర్… అతిక్ కంటే క్రూరమైన అతని భార్య…!

Atiq ahmed Murder Case : ఉత్తర్ ప్రదేశ్ లోని మాజీ ఎంపీని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ న్యూస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒకవైపు ఉత్తర్ ప్రదేశ్ లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం అంటూ అక్కడి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే మరోవైపు యూపి సర్కార్ ఒక చీడ పురుగును తొలగించి మంచి పనిచేసిందంటూ ప్రశంసిస్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరీ అతిక్ అహ్మద్ అంటే ఇతను రాజకీయ నాయకుడిగా కంటే ముందు ఒక గ్యాంగ్స్టర్. ఉత్తర్ ప్రదేశ్ లో హత్యలు, భూ కబ్జాలు చేస్తూ ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. అతిక్ అహ్మద్ పైన దాదాపు 100 పెద్ద పెద్ధ కేసులే ఉండటం గమనార్హం. అలాంటి అతిక్ ను పోలీస్ స్టేషన్ ముందట అందరూ చూస్తుండగా కొందరు వ్యక్తులు కాల్చి చంపడం ఇప్పుడు వైరల్ అయింది. తవ్వే కొద్ది ఆతిక్ అహ్మద్ బాధితులు బయటకు వస్తుంటే తాజాగా అతిక్ అహ్మద్ భార్య కూడా ఎంత దూర్మార్గురాలో తెలుస్తోంది.

కొడుకులను రౌడీలుగా పెంచిన తల్లి…

అతిక్ అహ్మద్ మొదటి సారి ఎమ్మెల్యే అయ్యాక షైస్తా పర్వీన్ అనే కానిస్టేబుల్ కూతురును పెళ్లి చేసుకున్నాడు. డిగ్రీ వరకు చదివిన షైస్తా పర్వీన్ అతిక్ ను పెళ్లి చేసుకుని ఐదుగురు మగబిడ్డలకు తల్లయింది. ఇక కొడుకులను రౌడీలుగా మార్చడంలో పర్వీన్ దే కీలకపాత్ర. ఏ తల్లయినా కొడుకులు మంచి ప్రవర్తనతో పెరగాలని భావిస్తారు. కానీ పర్వీన్ మాత్రం భర్తకు తగ్గ భార్యగా కొడుకులను కుడా భర్త లాగా రౌడీలను చేసింది. భర్త జైలులో ఉన్న సమయంలో ఆ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్న ఉమేష్ పాల్ అనే వ్యక్తిని కొడుకు అసద్ ను మరో రౌడీ షీటర్ ను పంపి పర్వీన్ నడిరోడ్డు మీద చంపించింది.

సీసీటీవీ లో అసద్ మరో వ్యక్తి కాల్పులు జరపడం క్లియర్ గా కనిపించడంతో పోలీసులు వారిని వెతికి మరీ కాల్చి చంపేశారు. ఇక కొడుకు అంత్యక్రియల సమయములోనే అతిక్ అహ్మద్ మీద కాల్పులు జరగడం మరణించడం జరిగింది. అయితే అందరూ పర్వీన్ ఇక పోలీసులకు లొంగిపోతుందని భావించినా ఆమె మాత్రం తప్పించుకుని తిరుతోంది. ముగ్గురు కొడుకులను రౌడీ లను చేసిన పర్వీన్ అసలు ఒక తల్లి ఇలా చేయగలదా అనేలా కొడుకులతో నేరాలను చేయించి డబ్బు సంపాదించడమే పరమావధి అనేలా చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

Bhargavi

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

5 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

7 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

8 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

8 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

10 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

10 hours ago