Featured

ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి సేవలకు అంతరాయం..!

నేడు, రేపు అంటే సెప్టెంబర్ 4 మరియు సెప్టెంబర్ 5 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవల్లో అంతరాయం కలగనుందని .. ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు తమ ఖాతాదారులు దీనిని గమనించాలని సూచించారు. బ్యాంక్ నిర్వహణ కార్యకలాపాలను సెప్టెంబర్ 4 రాత్రి 10.35 నుంచి సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 1.35 గంటల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి యోనో బిజినెస్, యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు వంటివి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తన బ్యాంకులో ఉన్న 44 కోట్ల ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఇటువంటి అంతరాయానికి మీము చింతిస్తున్నామంటూ కూడా ట్వీట్ చేసింది. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సేవలకు అంతరాయం కలగడం ఇది మొదటి సారి కాదు..

2021లోనే నాలుగైదు సార్లు ఇలానే అంతరాయాన్ని కలిగించారు. జూలై 16 మరియు 17లో మరియు ఆగస్టు 6, 7 తేదీల్లో కూడా ఇలా అంతరాయం కలిగించింది. వెంటనే ఎస్బీఐ సేవలను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.

అంతేకాకుండా కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని..బ్యాంక్ బ్రాంచ్ కు వచ్చే ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలంటూ ఖాతాదారులకు సూచించారు. ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ కు సంబంధించి వివరాలను షేర్ చేయకూడదని తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే.. బ్యాంక్ కు సంబంధించిన ఫోన్ నంబర్ కు కాల్ చేయాలన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

1 hour ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

1 hour ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

2 hours ago

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

9 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago